Madanapalle: 'తల్లికి వందనం'.. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇస్తున్న సీఎం చంద్రబాబు!

Madanapalle: మదనపల్లెలో 'తల్లికి వందనం' పథకంపై టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

Update: 2026-06-20 06:35 GMT

Madanapalle: 'తల్లికి వందనం'.. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇస్తున్న సీఎం చంద్రబాబు!

Madanapalle: మదనపల్లె ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ‘తల్లికి వందనం’ పథకం విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో అండగా నిలుస్తుందని మదనపల్లె టీడీపీ యూనిట్ ఇన్‌చార్జ్ కందికట్ల జయ, టీడీపీ సీనియర్ నాయకుడు కట్ట లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకుండా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉండి, పిల్లలను ఉన్నత చదువుల వైపు ప్రోత్సహిస్తుందన్నారు.

విద్యకు పెద్దపీట వేస్తూ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం అభినందనీయమని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News