Madanapalle: మదనపల్లెలో కన్నకొడుకు దారుణం.. ప్రెస్‌క్లబ్‌లో తల్లి గోడు

Madanapalle: మదనపల్లె నీరుగట్టువారిపల్లికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు సాలమ్మ తన కుమారుడు కప్పల రామచంద్రపై తీవ్ర ఆరోపణలు చేశారు.

Update: 2026-06-20 09:46 GMT

Madanapalle: మదనపల్లెలో కన్నకొడుకు దారుణం.. ప్రెస్‌క్లబ్‌లో తల్లి గోడు

మదనపల్లె: నీరుగట్టువారిపల్లికి చెందిన సాలమ్మ (70) తన కుమారుడు కప్పల రామచంద్ర తన వద్ద ఉన్న నగదు, బంగారాన్ని తీసుకుని అనంతరం తనను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. శనివారం మదనపల్లె ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె తన గోడును వెల్లగక్కారు.

తన ఆస్తులు, బంగారం, డబ్బులు కుమారుడి నమ్మకంతో ఇచ్చానని, కానీ ఇప్పుడు తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని వాపోయారు. వృద్ధాప్యంలో తనకు అండగా ఉండాల్సిన కుమారుడే తనను దూరం పెట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయంపై అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని, తన జీవనోపాధికి సహాయం అందించాలని సాలమ్మ వేడుకున్నారు. "దేవరా... నాకు న్యాయం చేయండి" అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

Tags:    

Similar News