Renigunta: రేణిగుంట డంపింగ్ యార్డులో భారీ మంటలు పొగతో స్థానికుల అవస్థలు
Renigunta: రేణిగుంట శ్రీనివాస కాలేజీ సమీపంలోని పంచాయతీ డంపింగ్ యార్డులో భారీ అగ్నిప్రమాదం. దట్టమైన పొగతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు, విద్యార్థులు.
Renigunta: రేణిగుంట డంపింగ్ యార్డులో భారీ మంటలు పొగతో స్థానికుల అవస్థలు
Renigunta: రేణిగుంట మండలం పరిధిలోని శ్రీనివాస కాలేజీ పక్కన ఉన్న పంచాయతీ డంపింగ్ యార్డులో భారీగా మంటలు చెలరేగాయి. చెత్త, పోగలతో కూడిన వ్యర్థాలకు మంటలు అంటుకోవడంతో దట్టమైన పొగ పరిసర ప్రాంతాలను కమ్మేసింది.
డంపింగ్ యార్డుకు సమీపంలోనే కాలేజీ, నివాస ప్రాంతాలు ఉండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంటల కారణంగా పొగ, దుర్వాసనతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు.
మంటలకు కారణం ఏమిటన్నది తెలియాల్సి ఉంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకోవడంతో పాటు, డంపింగ్ యార్డులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.