Punganur: బోయకొండ గంగమ్మ ఆలయ గోశాలకు రూ. 50 వేల విరాళం!
Punganur: బోయకొండ గంగమ్మ ఆలయ గోశాలకు రూ. 50 వేల విరాళం అందించిన మలేషియా ఏపీ ఎన్నార్టీ కోఆర్డినేటర్ శ్రీరామ జగదీష్ రాయల్, హిమబిందు దంపతులు.
Punganur: బోయకొండ గంగమ్మ ఆలయ గోశాలకు రూ. 50 వేల విరాళం!
Punganur: ప్రముఖ శక్తి క్షేత్రం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం నిర్వహిస్తున్న గోశాలకు రూ. 50వేల విరాళం అందింది.
చౌడేపల్లికి చెందిన మలేషియా ఏపీ ఎన్నార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కోఆర్డినేటర్ శ్రీరామ జగదీష్ రాయల్ హిమబిందు దంపతులు ఈ విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు విరాళం మొత్తాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి, డిప్యూటీ కమిషనర్ ఏకాంబరంకు దంపతులు అందజేశారు.
గోశాల నిర్వహణ గోసేవ కోసం ఎన్నారై దంపతులు ముందుకు రావడం పట్ల ఆలయ యంత్రాంగం హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.
దర్శనానంతరం ఆలయ మండపంలో శ్రీరామ జగదీష్ రాయల్, హిమబిందు దంపతులను ఆలయ అధికారులు శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించి, అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.