Chittoor: ఎస్వీసెట్ యూనివర్సిటీపై వదంతులు నమ్మొద్దు: వీసీ మోహన్‌బాబు!
Chittoor: చిత్తూరు ఎస్వీసెట్ ఇంజినీరింగ్ యూనివర్సిటీపై సోషల్ మీడియాలో వస్తున్న అదనపు ఫీజులు, ఆత్మహత్యాయత్నం వదంతులను నమ్మొద్దని వీసీ మోహన్‌బాబు శుక్రవారం స్పష్టం చేశారు.
Chittoor: ఎస్వీసెట్ యూనివర్సిటీపై వదంతులు నమ్మొద్దు: వీసీ మోహన్‌బాబు!
చిత్తూరు: ఎస్వీసెట్ ఇంజినీరింగ్ యూనివర్సిటీపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న వదంతులను విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మవద్దని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మోహన్‌బాబు కోరారు. అదనపు ఫీజుల వసూలు కారణంగా విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.
శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీలో అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారని, ఈ కారణంగా విద్యార్థులు ఆత్మహత్యాయత్నం చేశారంటూ కొన్ని సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. ఈ అంశంపై విద్యార్థుల కమిటీతో శుక్రవారం కలెక్టర్ సమావేశం నిర్వహించారని తెలిపారు.
శనివారం కళాశాల యాజమాన్యం కూడా కలెక్టర్‌ను కలిసి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన వివరాలను సమర్పించనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు ఎలాంటి అదనపు రుసుములు చెల్లించకుండా పరీక్షలు రాయవచ్చని వైస్ ఛాన్సలర్ స్పష్టం చేశారు.
మౌనిక అనే విద్యార్థిని గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉందని తెలిపారు. స్రవంతి అనే విద్యార్థిని కళాశాలలో లేదని పేర్కొన్నారు. కొంతమంది విద్యార్థుల పేర్లతో తప్పుడు సమాచారాన్ని సృష్టించి, మృతి చెందినట్లు కూడా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.విద్యార్థులు ఇలాంటి వదంతులను నమ్మి ఆందోళన చెందవద్దని, తమ చదువులపై దృష్టి సారించి పరీక్షలకు సిద్ధం కావాలని మోహన్‌బాబు సూచించారు.