Madanapalle: వంగిపోయిన డివైడర్ కమ్మీలు.. ఆదమరిస్తే ప్రమాదమే!

అన్నమయ్య జిల్లా: మదనపల్లె సంత సర్కిల్‌లోని టీటీడీ కల్యాణ మండపం సమీపంలో రోడ్డుకు మధ్యలో ఏర్పాటు చేసిన డివైడర్ కమ్మీలు పూర్తిగా వంగిపోయి ప్రమాదకరంగా మారాయి. వాహనదారులు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

విరిగిపోయి వంగిన కమ్మీలు వాహనదారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ప్రమాదకరంగా ఉన్న డివైడర్ కమ్మీలను తొలగించాలని వాహనదారులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Tags: