Madanapalle: ఈనెల 18న మదనపల్లెకు సీఎం చంద్రబాబు
Madanapalle: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 18న అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పర్యటించనున్నారు.
Madanapalle: ఈనెల 18న మదనపల్లెకు సీఎం చంద్రబాబు
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఈనెల 18న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నట్లు సమాచారం. గత నెలలో వాయిదా పడిన పర్యటనను ఈసారి నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు వేగవంతం చేసింది.
పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ వివిధ శాఖల అధికారులకు బాధ్యతలు కేటాయించగా, జిల్లా ఎస్పీ ధీరజ్ బందోబస్తు, వీవీఐపీ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు.
పర్యటనలో భాగంగా సీఎం చీకిలబైలు గ్రామపంచాయతీ పరిధిలో చెరువులను పరిశీలించి, స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కదిరి రోడ్డులో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నట్లు సమాచారం.