Punganur: రాజకీయాల్లో యువ నాయకుడిగా ఎదుగుతున్న అభి వర్షిత్ రెడ్డి

Punganur: పుంగనూరు నియోజకవర్గంలో యువ నాయకుడిగా అభి వర్షిత్ రెడ్డి తనదైన ముద్ర వేస్తున్నారు.

Update: 2026-05-15 05:27 GMT

Punganur: రాజకీయాల్లో యువ నాయకుడిగా ఎదుగుతున్న అభి వర్షిత్ రెడ్డి

పుంగనూరు: పుంగనూరు నియోజకవర్గంలో యువ నాయకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న నాయకుడు అభి వర్షిత్ రెడ్డి. మాజీ మంత్రి, పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీర్వాదం, రాజంపేట పార్లమెంట్ సభ్యుడు వెంకట మిథున్ రెడ్డి స్ఫూర్తితో ప్రజల్లో మంచి పట్టును ఏర్పరుచుకుంటూ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

యువత సమస్యలు, ప్రజా అంశాలపై స్పందిస్తూ స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటూ మంచి నాయకుడిగా ఎదుగుతున్నారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, యువతను రాజకీయాల వైపు ఆకర్షించే విధంగా పనిచేస్తున్న అభి వర్షిత్ రెడ్డి భవిష్యత్తులో మరింత కీలక నాయకుడిగా ఎదుగుతారని కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News