Gold Rate Today : తగ్గినట్లే తగ్గి మళ్లీ లేచింది.. పసిడి ధరలు చూస్తే షాక్ అవ్వాల్సిందే
Gold Rate Today : ఆగస్ట్ 6న బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ సహా ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,45,760కి చేరింది.
Gold Rate Today
Gold Rate Today : బంగారం, వెండి కొనాలనుకునే వారికి బులియన్ మార్కెట్ మరోసారి షాక్ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా స్వల్పంగా తగ్గుతూ ఊరటనిచ్చిన పసిడి ధరలు మళ్లీ పైపైకి చేరుతున్నాయి. గురువారం (ఆగస్ట్ 6) ఉదయం నమోదైన సమాచారం ప్రకారం దేశీయంగా బంగారం మరియు వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న రాజకీయ, ఆర్థిక పరిణామాల ప్రభావం ప్రత్యక్షంగా బులియన్ మార్కెట్‌పై పడటంతో ఈ హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఈరోజు బంగారం, వెండి రేట్లు ఎంతంటే?
దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధరపై రూ.10 పెరిగి రూ.1,45,760 కి చేరింది. ఇక ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర కూడా రూ.10 పెరిగి రూ.1,33,610 గా నమోదైంది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి ధరపై రూ.100 మేర పెరిగి మార్కెట్‌లో రూ.2,40,100 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే ?
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,45,760 గాను, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,33,610 గాను ఉంది. అలాగే ఈ నగరాల్లో కిలో వెండి ధర రూ.2,40,100 గా నమోదైంది. ముంబై, చెన్నై, బెంగళూరు నగరాల్లో కూడా సరిగ్గా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అయితే దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం పన్నుల వ్యత్యాసం వల్ల ధర కాస్త ఎక్కువగా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,45,910 గాను, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,33,760 గాను ఉంది.
ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు ఇవే
బంగారం, వెండి ధరల్లో ఈ స్థాయిలో మార్పులు రావడానికి అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త వాతావరణమే ప్రధాన కారణమని బులియన్ రంగ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న భౌగోళిక ఆర్థిక పరిస్థితుల వల్ల పెట్టుబడిదారులు సురక్షితమైన మార్గంగా భావించి పసిడి వైపు మొగ్గు చూపుతున్నారు.