Multibagger: 3 లక్షలకు 6 లక్షలు.. పెట్టుబడిని డబుల్ చేసిన క్రేజీ స్టాక్!
Multibagger: "బ్లూస్ప్రింగ్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ షేరు కేవలం 3 నెలల్లో 112% పైగా పెరిగి ఇన్వెస్టర్ల సంపదను రెట్టింపు చేసింది.
Multibagger: 3 లక్షలకు 6 లక్షలు.. పెట్టుబడిని డబుల్ చేసిన క్రేజీ స్టాక్!
Bluespring Enterprises share: భారత స్టాక్ మార్కెట్లో కొన్ని స్మాల్ క్యాప్ షేర్లు ఇన్వెస్టర్ల పాలిట నిజంగానే కల్పవృక్షంలా మారుతుంటాయి. తక్కువ కాలంలోనే ఊహించని రీతిలో లాభాల పంట పండిస్తుంటాయి. తాజాగా అలాంటి కోవకే చెందిన ఒక మల్టీబ్యాగర్ స్టాక్ దలాల్ స్ట్రీట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అదే బ్లూస్ప్రింగ్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ . కేవలం 3 నెలల కాలంలోనే ఈ షేరు ఏకంగా 100 శాతానికిపైగా పెరిగి ఇన్వెస్టర్ల సంపదను రెట్టింపు చేసింది.
అంటే, మూడు నెలల కిందట ఈ స్టాక్‌లో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టిన వారి వ్యాల్యూ ఇప్పుడు రూ. 2 లక్షలు అయింది. అదే రూ. 3 లక్షలు ఇన్వెస్ట్ చేసిన వారికి ఏకంగా రూ. 6 లక్షలకు పైగా లభించాయి. అసలు ఈ స్మాల్ క్యాప్ స్టాక్ ఇంతలా దూసుకెళ్లడానికి గల బలమైన కారణాలు, కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ కంపెనీ షేర్ వాల్యూ ఇంతలా పెరగడం వెనుక కేవలం మార్కెట్ సెంటిమెంట్ మాత్రమే కాదు, కంపెనీకి దక్కిన భారీ ఆర్డర్లు , అగ్రశ్రేణి ఇన్వెస్టర్ల నమ్మకం కూడా ఉన్నాయి.
వేదాంత అల్యూమినియం నుంచి భారీ ఆర్డర్
బ్లూస్ప్రింగ్ ఎంటర్‌ప్రైజెస్ అనుబంధ సంస్థ అయిన 'స్టీగ్ ఎనర్జీ సర్వీసెస్ (ఇండియా)' తాజాగా దిగ్గజ సంస్థ వేదాంతా అల్యూమినియం మెటల్స్ నుంచి ఏకంగా రూ. 1,437.17 కోట్ల భారీ కాంట్రాక్ట్‌ను సొంతం చేసుకుంది. వేదాంతాకు చెందిన 1215 మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్వహణ బాధ్యతల్ని (O&M) ఈ సంస్థకు అప్పగించారు. ఈ ఆర్డర్ వచ్చే ఐదేళ్ల పాటు అమల్లో ఉండనుంది.
బ్యాక్-టు-బ్యాక్ కోట్లాది రూపాయల కాంట్రాక్టులు
కేవలం పైన పేర్కొన్న ఒక్క ఆర్డరే కాదు.. గత నెలలోనే వేదాంత థర్మల్ పవర్ ప్లాంట్‌కు సంబంధించి రూ. 1,219.85 కోట్ల కాంట్రాక్ట్‌ను, అలాగే మరో రూ. 406.43 కోట్ల విలువైన మెయింటెనెన్స్ కాంట్రాక్టులను కూడా ఈ సంస్థే దక్కించుకుంది. ఇలా వరుసగా వేల కోట్ల రూపాయల ఆర్డర్లు రావడంతో కంపెనీ ఫైనాన్షియల్స్ భవిష్యత్తులో మరింత బలంగా మారనున్నాయనే అంచనాలు పెరిగాయి.
బిగ్ బుల్ ఆశిష్ ధావన్ ఎంట్రీ
భారత మార్కెట్లోని ప్రముఖ మరియు మేధావి ఇన్వెస్టర్లలో ఒకరైన ఆశిష్ ధావన్ ఈ కంపెనీలో తన వాటాను ఏకంగా 6.30 శాతానికి పెంచుకున్నారు. మార్కెట్ దిగ్గజాలే కంపెనీపై నమ్మకం ఉంచడంతో, రిటైల్ ఇన్వెస్టర్లు కూడా ఈ షేరును కొనేందుకు ఎగబడ్డారు. దాంతో స్టాక్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
స్టాక్ ప్రస్తుత మార్కెట్ ప్రొఫైల్
ప్రస్తుత షేర్ ధర: రూ. 124.50
52 వారాల గరిష్ఠ ధర: రూ. 131.82
52 వారాల కనిష్ఠ ధర: రూ. 43.98
మార్కెట్ క్యాపిటలైజేషన్ (విలువ): సుమారు రూ. 1.86 వేల కోట్లు
కంపెనీ ప్రధాన బిజినెస్ ఏంటి?
బ్లూస్ప్రింగ్ ఎంటర్‌ప్రైజెస్ వైవిధ్యమైన సేవల రంగంలో దూసుకుపోతోంది. దీని ప్రధాన బిజినెస్ రంగాలను ఓసారి పరిశీలిస్తే.. కార్పొరేట్, పారిశ్రామిక రంగాలకు అవసరమైన మేనేజ్‌మెంట్ సేవలు,టెలికాం రంగానికి సంబంధించిన మౌలిక వసతుల సేవలు, థర్మల్, అల్యూమినియం వంటి భారీ పవర్ ప్లాంట్ల ఆపరేషన్స్ ,మెయింటెనెన్స్ బాధ్యతలు వంటివి కంపెనీ ప్రధాన బిజినెస్‌గా కనిపిస్తుంది.
భారీ ఆర్డర్లు, ప్రముఖ ఇన్వెస్టర్ల ఎంట్రీతో ఈ స్టాక్ ప్రస్తుతం మార్కెట్లో హాట్ కేక్‌లా మారినప్పటికీ.. స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో రిస్క్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.