Saving Scheme: కాలుపై కాలివేసుకొని కూర్చున్నా.. నెల‌కు రూ. 20,500 పొందే అవ‌కాశం

Saving Scheme: రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెలా స్థిరమైన ఆదాయం ఉండాలని చాలా మంది కోరుకుంటారు.

Update: 2026-06-26 08:31 GMT

Saving Scheme: కాలుపై కాలివేసుకొని కూర్చున్నా.. నెల‌కు రూ. 20,500 పొందే అవ‌కాశం

Saving Scheme: రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెలా స్థిరమైన ఆదాయం ఉండాలని చాలా మంది కోరుకుంటారు. అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) మంచి పెట్టుబడి ఎంపికగా నిలుస్తోంది. పోస్టాఫీస్ ద్వారా అందుబాటులో ఉన్న ఈ పథకంలో ఒకేసారి పెట్టుబడి పెడితే, ప్రభుత్వ హామీతో త్రైమాసిక ప్రాతిపదికన వడ్డీ లభిస్తుంది. ప్రస్తుతం ఈ పథకంపై 8.2 శాతం వార్షిక వడ్డీ అందుతోంది.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అంటే ఏంటి?

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ప్రత్యేకంగా రిటైర్ అయిన వృద్ధుల కోసం రూపొందించిన ప్రభుత్వ పొదుపు పథకం. ఇందులో పెట్టుబడి పెట్టిన మొత్తానికి కేంద్ర ప్రభుత్వ భద్రత ఉంటుంది. అందువల్ల పెట్టుబడిపై ఎలాంటి మార్కెట్ రిస్క్ ఉండదు. అధిక వడ్డీతో పాటు క్రమం తప్పకుండా ఆదాయం కావాలనుకునే వారికి ఈ పథకం మంచి ఎంపికగా భావిస్తున్నారు. చాలా బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే ఈ పథకంలో వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది.

ప్రస్తుతం ఎంత వడ్డీ లభిస్తోంది?

ప్రస్తుతం సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై ఏడాదికి 8.2 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ వడ్డీని ప్రతి నెల కాకుండా మూడు నెలలకు ఒకసారి (త్రైమాసికం) నేరుగా ఖాతాలో జమ చేస్తారు. దీంతో రిటైర్మెంట్ తర్వాత ఇంటి ఖర్చులు, ఇతర అవసరాలకు క్రమం తప్పకుండా ఆదాయం అందుతుంది.

ఎంత పెట్టుబడి పెట్టొచ్చు? ఎవరు ఖాతా తెరవొచ్చు?

ఈ పథకంలో ఖాతా ప్రారంభించడానికి కనీసం రూ.1,000 పెట్టుబడి అవసరం. ఒక వ్యక్తి గరిష్టంగా రూ.30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. భార్యాభర్తలు విడివిడిగా లేదా జాయింట్ అకౌంట్ కూడా తెరవొచ్చు. అయితే ప్రతి ఖాతాకు గరిష్ట పెట్టుబడి పరిమితి రూ.30 లక్షలుగానే ఉంటుంది. దేశంలోని ఏ పోస్టాఫీస్‌లోనైనా అవసరమైన పత్రాలు సమర్పించి సులభంగా ఈ ఖాతా ప్రారంభించవచ్చు.

రూ.30 లక్షలు పెట్టుబడి పెడితే ఎంత ఆదాయం వస్తుంది?

ఒకవేళ ఈ పథకంలో రూ.30 లక్షలు పెట్టుబడి పెడితే, ప్రస్తుతం ఉన్న 8.2 శాతం వడ్డీ రేటు ప్రకారం.. ఏడాదికి వడ్డీ రూ.2,46,000 ల‌భిస్తుంది. మూడు నెలలకు ఒకసారి వచ్చే వడ్డీ రూ.61,500 ఈ లెక్క‌న చూస్తే నెలవారీ లెక్కన సగటు ఆదాయం: సుమారు రూ.20,500 పొందొచ్చు. అంటే రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెలా సుమారు రూ.20,500 ఆదాయం వచ్చినట్లుగా భావించవచ్చు.

మెచ్యూరిటీ తర్వాత ఎంత మొత్తం వస్తుంది?

ఈ పథకం మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు. ఈ కాలం పూర్తయ్యే సరికి రూ.30 లక్షల పెట్టుబడిపై మొత్తం రూ.12.30 లక్షల వరకు వడ్డీ లభించే అవకాశం ఉంటుంది. అంటే ఐదేళ్ల తర్వాత.. అసలు పెట్టుబడి రూ.30 లక్షలు

మొత్తం వడ్డీ రూ.12.30 లక్షలు అవుతుంది. అంటే చేతికి అందే మొత్తం రూ.42.30 లక్షలు అవుతుంది. మెచ్యూరిటీ అనంతరం నిబంధనల ప్రకారం ఖాతాను పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. ప్రభుత్వ హామీ, స్థిరమైన వడ్డీ, క్రమం తప్పకుండా ఆదాయం వంటి ప్రయోజనాల కారణంగా రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కోరుకునే వారికి ఈ పథకం మంచి ఎంపికగా చెప్పవచ్చు.

Tags:    

Similar News