Jio Family Plan: కేవలం రూ. 449తోనే ఇంటిల్లిపాదికీ పండగ.. అపరిమిత కాల్స్, ఓటీటీలు కూడా..
Reliance Jio Offers: ఫ్యామిలీ మొత్తానికి సరిపోయేలా రిలయన్స్ అద్భుతమైన ప్లాన్ ను తీసుకొచ్చింది. ఒక్క ప్లాన్ తో కుటుంబంలోని నలుగురు విచ్చలవిడిగా వాడుకోవచ్చు. ఆప్లాన్ వివరాలు ఏంటో ఓసారి చూద్దాం..
Jio Family Plan
Reliance Jio Offers: కుటుంబంలోని ప్రతి సభ్యునికి విడివిడిగా రీఛార్జ్ చేసే ఇబ్బందులకు రిలయన్స్ జియో స్వస్తి పలికింది. కొత్త ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ద్వారా ఒకే బిల్లుతో నలుగురు సభ్యులు అపరిమిత ప్రయోజనాలను పొందవచ్చు. ఇందులో భారీగా డేటా, ఉచిత ఓటిటి సబ్‌స్క్రిప్షన్లతో పాటు వేల రూపాయల విలువైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఒకే రీఛార్జ్.. నలుగురికి వినోదంతోపాటు కనెక్టివిటీ..
నేటి డిజిటల్ యుగంలో ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కో రకమైన డేటా అవసరాలను కలిగి ఉంటారు. పిల్లల చదువుల కోసం, పెద్దల వినోదం కోసం లేదా ఆఫీసు పనుల కోసం విడివిడి రీఛార్జ్‌లు చేయడం ఆర్థికంగా భారమే కాకుండా నిర్వహణ కూడా కష్టతరమవుతుంది. ఈ సమస్యను గుర్తించిన రిలయన్స్ జియో, తన వినియోగదారుల కోసం అత్యంత చౌకైన, లాభదాయకమైన ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. దీనివల్ల నెలవారీ ఖర్చు తగ్గడమే కాకుండా, ప్రీమియం సేవలు ఉచితంగా లభిస్తాయి.
రూ. 449 ప్లాన్ విశేషాలు..
జియో అందిస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్యామిలీ ప్లాన్ రూ. 449 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్లాన్ ఫీచర్లను ఓసారి చూద్దాం..:
డేటా: నెలకు 75 జిబి ఉమ్మడి డేటా లభిస్తుంది. ఒకవేళ ఈ పరిమితి ముగిస్తే, ప్రతి జబీకి కేవలం రూ. 10 మాత్రమే వసూలు చేస్తారు.
అదనపు సిమ్ కార్డ్స్: ఈ ప్లాన్‌లో ప్రధాన వినియోగదారునితో పాటు మరో ముగ్గురు కుటుంబ సభ్యులను చేర్చుకోవచ్చు. ప్రతి అదనపు సిమ్ కోసం నెలకు రూ. 150 చెల్లిస్తే సరిపోతుంది. ప్రతి అదనపు సిమ్ కార్డుపై 5 జీబీ అదనపు డేటా కూడా లభిస్తుంది.
కాలింగ్, ఎస్ఎమ్ఎస్: దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 మెసేజ్ లు ఉచితం.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్టోరేజ్ ఆఫర్లు..
ఈ ప్లాన్ కేవలం కాలింగ్, డేటాకే పరిమితం కాలేదు. గూగుల్ జెమిని ప్రో ప్లాన్‌ను 18 నెలల పాటు ఉచితంగా అందిస్తోంది. దీని మార్కెట్ విలువ సుమారు రూ. 35,100 ఉంటుంది. దీనితో పాటు 5000 జీబీ క్లౌడ్ స్టోరేజ్, జియో టీవీ వంటి సేవలు అదనం. ఇది వృత్తిపరమైన పనులు చేసుకునే వారికి, ఫోటోలు, వీడియోలను భద్రపరుచుకోవాలనుకునే వారికి ఒక గొప్ప వరం.
మరింత వినోదం కోసం రూ. 749 ప్లాన్..
సినిమాలు, వెబ్ సిరీస్‌లను ఎక్కువగా ఇష్టపడే కుటుంబాల కోసం జియో రూ. 749 ప్లాన్‌ను రూపొందించింది. ఇందులో నెలకు 100 జీబీ డేటా లభిస్తుంది. దీని ప్రధాన ఆకర్షణ నెట్‌ఫ్లిక్స్ బేసిక్ ప్లాన్, రెండు సంవత్సరాల పాటు అమెజాన్ ప్రైమ్ లైట్ సభ్యత్వం ఉచితంగా లభించడం.
వ్యక్తిగత అవసరాల కోసం మరిన్ని ఎంపికలు..
ఒంటరిగా ఉండేవారికి లేదా తక్కువ డేటా వాడేవారికి కూడా జియో విభిన్న ప్లాన్‌లను అందిస్తోంది:
రూ. 349 ప్లాన్: నెలకు 30 జీబీ డేటా, గూగుల్ జెమిని ప్రయోజనాలు.
రూ. 649 ప్లాన్: ఇంటి నుంచి పని చేసే వారికి అపరిమిత డేటా సౌకర్యం.
రూ. 1549 ప్లాన్: 300 జీబీ డేటాతో పాటు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి ప్రీమియం సేవలు.
మొత్తానికి, రిలయన్స్ జియో తన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ద్వారా అటు సామాన్యులకు, ఇటు టెక్ ప్రియులకు సరికొత్త డిజిటల్ అనుభూతిని అందిస్తోంది.