Shares : ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్: 1 షేరు కొంటే 10 షేర్లు ఫ్రీ..!

Shares : ఒక్క షేరుకు 10 బోనస్ షేర్లు.. రికార్డు డేట్ పూర్తి వివరాలు ఇవే.

Update: 2026-06-22 01:52 GMT

Shares : ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్: 1 షేరు కొంటే 10 షేర్లు ఫ్రీ..!

Kotyark Industries : స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఒక అదిరిపోయే శుభవార్త! స్మాల్ క్యాప్ కేటగిరిలోని ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ కంపెనీ 'కోట్యార్క్ ఇండస్ట్రీస్ లిమిటెడ్' తమ షేర్ హోల్డర్లకు కళ్లు చెదిరే బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఏకంగా 10:1 రేషియోలో బోనస్ షేర్లను ఇవ్వాలని కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయించారు. దీనికి సంబంధించిన రికార్డు డేట్‌ను జూన్ 24, 2026 గా కంపెనీ తాజాగా ఖరారు చేసింది. అయితే, ఈ ఉచిత షేర్లను సొంతం చేసుకోవడానికి ఇన్వెస్టర్లకు కేవలం 3 రోజులు మాత్రమే సమయం ఉంది.

కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం.. రికార్డు తేదీ నాటికి మీ డీమ్యాట్ ఖాతాలో రూ. 10 ఫేస్ వ్యాల్యూ ఉన్న ఒక్క ఈక్విటీ షేరు ఉంటే, దానికి అదనంగా రూ. 1 ఫేస్ వ్యాల్యూ కలిగిన 10 ఈక్విటీ షేర్లు బోనస్ రూపంలో ఉచితంగా లభిస్తాయి. అంటే మీ దగ్గర ఉన్న ఒక్క షేరు కాస్తా 11 షేర్లుగా మారుతుందన్నమాట. ఈ ఉచిత బోనస్ షేర్లను పొందాలనుకునే వారు ఎక్స్-బోనస్ ట్రేడింగ్‌కు ఒక రోజు ముందు మార్కెట్ ముగిసే సమయానికి కంపెనీ షేర్లను కొనుగోలు చేసి ఉండాలి.

ఈ వార్తాగ్రంథం నేపథ్యంలో కోట్యార్క్ ఇండస్ట్రీస్ షేరుపై ఇన్వెస్టర్ల కన్ను పడింది. చివరి ట్రేడింగ్ సెషన్లో ఈ షేరు 3 శాతం నష్టపోయి రూ. 388 వద్ద స్థిరపడినప్పటికీ, గత కొంతకాలంగా ఈ స్టాక్ ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రిటర్న్స్‌ను అందిస్తూ వస్తోంది.

కంపెనీ రిటర్న్స్ ట్రాక్ రికార్డ్‌ను ఓసారి పరిశీలిస్తే..గత వారం రోజుల్లో 8% లాభం,గత నెల రోజుల్లో 16% లాభం,గత 6 నెలల్లో 48% లాభం,గత ఏడాది కాలంలో 20% లాభం,గత 5 ఏళ్లలో ఏకంగా 339% భారీ లాభాలను నమోదు చేసింది.ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 399 కోట్లు.52 వారాల గరిష్ఠ ధర రూ. 464.25. 52 వారాల కనిష్ఠ ధర రూ. 316.00. చిన్న కంపెనీ అయినప్పటికీ ఐదేళ్లలో 339 శాతం లాభాలను పంచిన ఈ స్టాక్, ఇప్పుడు భారీ బోనస్ ఆఫర్‌తో మార్కెట్లో హాట్ టాపిక్‌గా మారింది. మరి ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇన్వెస్టర్లు ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి.

Tags:    

Similar News