Hyderabad Real Estate: కోకాపేట రికార్డులు బ్రేక్ చేసే నెక్స్ట్ ఏరియా ఇదే.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొత్త హాట్ స్పాట్!

Hyderabad Real Estate: హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కోకాపేట తర్వాత నెక్స్ట్ ఏంటి? అనే ప్రశ్నకు 'శంకరపల్లి' సమాధానంగా మారుతోంది.

Update: 2026-06-16 05:29 GMT

Hyderabad Real Estate: కోకాపేట రికార్డులు బ్రేక్ చేసే నెక్స్ట్ ఏరియా ఇదే.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొత్త హాట్ స్పాట్!

Hyderabad Real Estate: భారతదేశంలోనే అత్యంత వేగంగా దూసుకుపోతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్‌గా హైదరాబాద్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కేంద్రంగా నగర పశ్చిమ ప్రాంతం (West Hyderabad) ఇప్పుడు గ్లోబల్ సిటీ న్యూయార్క్‌ను తలపిస్తూ ఆకాశహర్మ్యాలతో నిండిపోతోంది. తాజాగా ప్రభుత్వం జరిపిన భూముల వేలంలో ఎకరం ధర ఏకంగా రూ. 230 కోట్లకు పైగా పలికి సరికొత్త చరిత్రను లిఖించింది.

గడచిన రెండు దశాబ్దాలుగా హైదరాబాద్ రియల్ రంగానికి కోకాపేట ప్రాంతం గుండెకాయలా నిలిచింది. 2006 (వైఎస్సార్ హయాం): కోకాపేటలో తొలిసారి వేలం వేసినప్పుడు ఎకరం ధర రూ. 15 కోట్లు. కేసీఆర్ హయాం: క్రమంగా పెరుగుతూ ఎకరం ధర రూ. 100 కోట్ల మార్కును అందుకుంది. ప్రస్తుత మార్కెట్: గడిచిన మూడేళ్లలోనే ఇక్కడ ధరలు రెండింతలయ్యాయి. ఓపెన్ మార్కెట్‌లో ఎకరం రూ. 150 కోట్ల నుండి రూ. 200 కోట్లు పలుకుతుండగా.. ప్రభుత్వ వేలంలో అది రూ. 230 కోట్లు దాటి రికార్డు సృష్టించింది.

ప్రస్తుతం కోకాపేట ప్రాంతం దాదాపు అంతర్జాతీయ బిల్డర్ల మెగా ప్రాజెక్టులు, హైరైజ్ బిల్డింగ్స్‌తో పూర్తిగా నిండిపోయింది. దీంతో రియల్ ఎస్టేట్ నిపుణుల చూపు ఇప్పుడు శంకరపల్లి (Shankarpally) వైపు మళ్లింది. కోకాపేట తర్వాతి లెవెల్ గ్రోత్ శంకరపల్లిలోనే ఉండబోతుందని నిపుణులు బల్లగుద్ది చెబుతున్నారు.

శంకరపల్లి రేసులోకి రావడానికి ప్రధాన కారణాలు:

ప్రీమియం విల్లా జోన్: ఈ ప్రాంతం ఇప్పటికే లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టులకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది.

ఐటీ కారిడార్‌కు సామీప్యత: గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నార్సింగి, కోకాపేట ప్రాంతాల్లో పనిచేసే ఐటీ ఉద్యోగులు ప్రశాంతమైన వాతావరణం కోసం నివాస స్థలంగా శంకరపల్లిని ఎంచుకుంటున్నారు.

భారీ మౌలిక వసతులు: గండిపేట నుండి శంకరపల్లి వరకు రోడ్డును ప్రయాణ సమయం తగ్గేలా '6-లేన్లుగా' విస్తరిస్తున్నారు.

గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాజెక్ట్: ప్రభుత్వం శంకరపల్లిని "శంకరపల్లి - ముత్తంగి - కోకాపేట" గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాజెక్టులో భాగంగా రికార్డు స్థాయిలో అభివృద్ధి చేస్తోంది. భవిష్యత్తులో ఇక్కడ మరిన్ని ఐటీ, ఇండస్ట్రియల్ హబ్‌లు రానున్నాయి.

ప్రస్తుతం శంకరపల్లి ప్రాంతంలో ఎకరం భూమి ధర దాదాపు రూ. 20 కోట్ల వరకు పలుకుతోంది. భవిష్యత్తు ఐటీ విస్తరణ ప్రణాళికల దృష్ట్యా, రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింత భారీగా పెరిగి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags:    

Similar News