Aadhaar Deactivation: మ‌ర‌ణించిన వ్య‌క్తి ఆధార్ డేటాను ప్ర‌భుత్వం ఏం చేస్తుందో తెలుసా.?

Aadhaar Deactivation: సిమ్ కార్డు నుంచి ట్రైన్ టికెట్ వ‌ర‌కూ ప్ర‌తీ దానికి ఆధార్ కార్డ్ త‌ప్ప‌నిస‌రిగా మారింది.

Update: 2026-08-11 10:30 GMT

Aadhaar Deactivation: మ‌ర‌ణించిన వ్య‌క్తి ఆధార్ డేటాను ప్ర‌భుత్వం ఏం చేస్తుందో తెలుసా.? 

Aadhaar Deactivation: సిమ్ కార్డు నుంచి ట్రైన్ టికెట్ వ‌ర‌కూ ప్ర‌తీ దానికి ఆధార్ కార్డ్ త‌ప్ప‌నిస‌రిగా మారింది. అయితే ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని ఆధార్ నంబర్‌ను అలాగే యాక్టివ్‌గా ఉంటుందా.? ఆ డేటాను ప్ర‌భుత్వం ఏం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మరణించిన వ్యక్తి ఆధార్‌ను డీయాక్టివేట్ చేయడం ఎందుకు అవసరం?

ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా అతని ఆధార్ యాక్టివ్‌గా ఉంటే దాన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంటుంది. మోసగాళ్లు ఆ ఆధార్‌తో బ్యాంకు ఖాతాలు తెరవడం, రుణాలు తీసుకోవడం, సిమ్ కార్డులు పొందడం లేదా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అక్రమంగా పొందే ప్రయత్నం చేయవచ్చు. ఇలాంటి మోసాల వల్ల కుటుంబ సభ్యులు కూడా చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఆధార్‌ను డీయాక్టివేట్ చేయడం ద్వారా ఈ ప్రమాదాలను తగ్గించడంతో పాటు ప్రభుత్వ డేటాబేస్ కూడా మరింత క‌చ్చితంగా ఉంటుంది.

UIDAI ఆధార్‌ను పూర్తిగా తొలగించదు

యూఐడీఏఐ (యూనిక్ ఐడెంటిఫికేష‌న్ అథారిటీ ఆఫ్ ఇండియా) మరణించిన వ్యక్తి ఆధార్ వివరాలను పూర్తిగా తొలగించదు. ఎందుకంటే ప్రతి ఆధార్ నంబర్ ప్రత్యేకమైనది. ఒకసారి కేటాయించిన ఆధార్ నంబర్‌ను మరో వ్యక్తికి ఎప్పటికీ ఇవ్వరు. అలాగే ఆస్తుల యాజమాన్యం, బ్యాంకు ఖాతాలు, పన్ను రికార్డులు వంటి చట్టపరమైన అవసరాల కోసం పాత వివరాలను భద్రంగా ఉంచాల్సి ఉంటుంది. అయితే మరణించిన వ్యక్తికి సంబంధించిన వేలిముద్రలు, ఐరిష్‌ స్కాన్, ముఖ గుర్తింపు వంటి బయోమెట్రిక్ వివరాలను శాశ్వతంగా లాక్ చేస్తారు. దీంతో వాటిని ఉపయోగించి ఎవరూ మోసాలకు పాల్పడలేరు.

మరణించిన వ్యక్తి ఆధార్‌ను ఎలా డీయాక్టివేట్ చేస్తారు?

UIDAI వివిధ ప్రభుత్వ శాఖలతో కలిసి పనిచేస్తూ మరణాల నమోదుకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుంది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నిర్వహించే జనన, మరణ నమోదు వ్యవస్థ నుంచి వివరాలను పొందుతుంది.

అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకులు, బీమా సంస్థల నుంచి కూడా ధృవీకరించిన సమాచారం ఆధారంగా రికార్డులను అప్‌డేట్ చేస్తుంది. కుటుంబ సభ్యులు మైఆధార్‌ పోర్టల్ ద్వారా కూడా మరణించిన వ్యక్తి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయవచ్చు. ఇందుకోసం మరణించిన వ్యక్తి 12 అంకెల ఆధార్ నంబర్, మరణ నమోదు సంఖ్య, వ్యక్తిగత వివరాలు, డెత్ స‌ర్టిఫికేట్, దరఖాస్తు చేస్తున్న కుటుంబ సభ్యుడి ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ ద్వారా OTP ధృవీకరణ వంటి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.

దరఖాస్తు సమర్పించిన తర్వాత UIDAI ఒక రిక్వెస్ట్ నంబర్ ఇస్తుంది. దాని ద్వారా అప్లికేష‌న్ స్టేట‌స్‌ తెలుసుకోవచ్చు. స‌బ్‌మిట్ చేసిన‌ వివరాలను సంబంధిత రాష్ట్ర మరణ నమోదు వ్యవస్థతో సరిపోల్చి పరిశీలిస్తారు. అన్ని వివరాలు సరైనవిగా తేలితే ఆధార్‌ను శాశ్వతంగా డీయాక్టివేట్ చేస్తారు. ఆ తర్వాత ఆ ఆధార్‌తో బయోమెట్రిక్ ధృవీకరణ, OTP ఆధారిత సేవలు పనిచేయవు.

అయితే పొరపాటున జీవించి ఉన్న వ్యక్తి ఆధార్‌ను డీయాక్టివేట్ చేస్తే, అతను సమీపంలోని ఆధార్ సేవా కేంద్రం లేదా UIDAI ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లి సరైన గుర్తింపు పత్రాలు సమర్పించాలి. అవసరమైన పత్రాల పరిశీలన, కొత్త బయోమెట్రిక్ నమోదు తర్వాత UIDAI మళ్లీ ఆధార్‌ను యాక్టివ్ చేస్తుంది.

Tags:    

Similar News