Maruti Brezza Facelift : కొత్త ఇంజిన్‌తో వస్తోన్న 'మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్'.. జూలై 23న గ్రాండ్ ఎంట్రీ.!
Maruti Brezza Facelift : భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీలలో 'మారుతి సుజుకి బ్రెజ్జా' ఒకటి. 2022లో వచ్చిన సెకండ్-జనరేషన్
Maruti Brezza Facelift
Maruti Brezza Facelift : భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీలలో 'మారుతి సుజుకి బ్రెజ్జా' ఒకటి. 2022లో వచ్చిన సెకండ్-జనరేషన్ మోడల్ తర్వాత, ఈ కార్‌కు మొదటిసారిగా ఒక మేజర్ అప్‌డేట్ ఇచ్చేందుకు మారుతి సుజుకి సిద్ధమైంది. సరికొత్త లుక్, సరికొత్త ఫీచర్లు , అన్నింటికంటే ముఖ్యంగా ఒక పవర్‌ఫుల్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో కూడిన ఈ 'బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్' మోడల్ జూలై 23న భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
బిగ్ అప్‌డేట్.. సరికొత్త టర్బో-పెట్రోల్ ఇంజిన్
ఈ తాజా అప్‌డేట్‌లో అందరినీ ఆకర్షిస్తున్న ప్రధాన మార్పు.. ఇందులో ప్రవేశపెట్టబోయే 1.0-లీటర్ బూస్టర్‌జెట్ టర్బో-పెట్రోల్ ఇంజిన్. ప్రస్తుతం మారుతి ఫ్రాంక్స్ (Fronx) కారులో వాడుతున్న ఈ 3-సిలిండర్ మోడల్ ఇంజిన్, 100bhp పవర్ , 148Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బ్రెజ్జాలో దీనికి 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ను జత చేయనున్నట్లు సమాచారం. ఇటీవల భారతీయ రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించిన బ్రెజ్జా కార్లలో 6-స్పీడ్ గేర్ లివర్ ఉండటం ఈ అంచనాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
ప్రస్తుతం బ్రెజ్జా కారులో కేవలం 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ మాత్రమే ఉంది. కానీ, దీనికి పోటీగా ఉన్న హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, కియా సోనెట్, మహీంద్రా XUV 3XO , స్కోడా కైలాక్ వంటి కార్లు ఇప్పటికే టర్బో-పెట్రోల్ ఆప్షన్లను అందిస్తున్నాయి. ఇప్పుడు రాబోయే కొత్త టర్బో ఇంజిన్‌తో బ్రెజ్జా తన ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వనుంది.
ధర పరంగా భారీ అడ్వాంటేజ్?
భారతదేశ జిఎస్‌టి (GST) నిబంధనల ప్రకారం.. 4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉండి, 1200cc లోపు పెట్రోల్ ఇంజిన్ కలిగిన వాహనాలపై 18 శాతం మాత్రమే జీఎస్‌టి పడుతుంది. పెద్ద ఇంజిన్లతో పోలిస్తే వీటికి పన్ను తక్కువ. కాబట్టి, 1.0-లీటర్ ఇంజిన్‌తో రాబోయే ఈ కొత్త బ్రెజ్జా వేరియంట్లపై పన్ను భారం తగ్గనుంది. ఒకవేళ మారుతి సుజుకి ఈ పన్ను ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తే, టర్బో వేరియంట్లు మెరుగైన పర్ఫార్మెన్స్‌తో పాటు చాలా తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది. కాగా, ప్రస్తుతం ఉన్న 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ , సీఎన్‌జీ (CNG) వేరియంట్లు కూడా యథావిధిగా విక్రయించబడతాయి.
కొత్త లుక్ , అదిరిపోయే ఫీచర్లు
కారు డిజైన్ పరంగా పూర్తిగా మార్చకుండా, కొన్ని ఆకర్షణీయమైన మార్పులు మాత్రమే చేయనున్నారు. ముందు భాగంలో బంపర్ డిజైన్‌ను మార్చడంతో పాటు ఎల్‌ఈడీ లైట్లను మరింత స్టైలిష్‌గా అప్‌డేట్ చేయనున్నారు. వెనుక భాగంలో సరికొత్త మారుతి ఎస్‌యూవీల తరహాలోనే 'కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ లాంప్స్' , సరికొత్త అల్లాయ్ వీల్స్ రానున్నాయి.
ఇక క్యాబిన్ లోపల డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ పాతదానిలానే ఉన్నప్పటికీ, ప్రీమియం ట్రిమ్ ఫినిషింగ్స్ , కొత్త అప్హోల్స్టరీ (సీట్ల డిజైన్) కలర్స్‌ను అందించనున్నారు. ఫీచర్ల పరంగా ప్రస్తుతం ఉన్న 9-ఇంచ్ టచ్‌స్క్రీన్‌కు బదులుగా పెద్దదైన 10.1-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చనున్నారు. వీటితో పాటు పవర్డ్ డ్రైవర్ సీట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, యాంబియంట్ లైటింగ్ , ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్ల వంటి సరికొత్త ఫీచర్లు ఈ కార్ లో చేరనున్నాయి.
సరికొత్త ఫీచర్లు , ఇంజిన్ అప్‌డేట్స్ కారణంగా కొత్త బ్రెజ్జా ధర ప్రస్తుత మోడల్ కంటే స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. మార్కెట్లోకి విడుదలైన తర్వాత ఇది హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, కియా సోనెట్, కియా సైరోస్, మహీంద్రా XUV 3XO , స్కోడా కైలాక్ వంటి కాంపాక్ట్ ఎస్‌యూవీలతో పోటీ పడనుంది.