Ather Energy : రెండేళ్లలోనే 3 లక్షల స్కూటర్ల అమ్మకం.. ఫ్యామిలీ ఈవీ మార్కెట్‌లో తిరుగులేని కింగ్

Ather Energy : ఏథర్ రిజ్తా ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం రెండేళ్లలో 3 లక్షల యూనిట్ల విక్రయాలతో రికార్డు సృష్టించింది. 160 కిమీ రేంజ్, భారీ స్టోరేజ్ ఫీచర్లతో ఫ్యామిలీ కస్టమర్లను ఆకట్టుకుంటోంది.

Update: 2026-05-12 02:41 GMT

Ather Energy : భారతీయ ఎలక్ట్రానిక్ వాహన రంగంలో ఏథర్ ఎనర్జీ సరికొత్త రికార్డు సృష్టించింది. ఆ కంపెనీ నుంచి వచ్చిన ఫ్యామిలీ ఫోకస్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ రిజ్తా అమ్మకాల్లో దూసుకుపోతోంది. మార్కెట్లోకి విడుదలైన కేవలం రెండేళ్లలోనే 3 లక్షల యూనిట్ల విక్రయాల మార్కును దాటి ఏథర్ చరిత్రలో అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా నిలిచింది. ముఖ్యంగా 2026 ఆర్థిక సంవత్సరంలో ఏథర్ కంపెనీ సాధించిన మొత్తం అమ్మకాల్లో 76 శాతం వాటా ఒక్క రిజ్తాదే కావడం విశేషం. సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ ఇండియాలో కూడా ఈ స్కూటర్ ఇప్పుడు హాట్ కేకులా అమ్ముడవుతోంది.

ఏథర్ రిజ్తా ప్రయాణం ఒక అద్భుతం అని చెప్పాలి. 2025 డిసెంబర్ నాటికి 2 లక్షల యూనిట్ల అమ్మకాలు పూర్తి చేసుకున్న ఈ స్కూటర్, ఆ తర్వాత కేవలం ఐదు నెలల్లోనే మరో లక్ష యూనిట్లను అమ్మి 3 లక్షల మార్కును చేరుకుంది. గతంలో ఏథర్ అంటే కేవలం దక్షిణ భారతదేశానికే పరిమితం అనే ముద్ర ఉండేది. కానీ రిజ్తా పుణ్యమా అని మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కంపెనీ మార్కెట్ వాటా 4.1 శాతం నుంచి ఏకంగా 17.3 శాతానికి పెరిగింది. పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా ఏథర్ తన ఉనికిని మూడు రెట్లు పెంచుకోవడం ఈ స్కూటర్ క్రేజ్‌కు నిదర్శనం.

కుటుంబ అవసరాలకు తగ్గట్టుగా రిజ్తాను డిజైన్ చేయడమే దీని సక్సెస్ సీక్రెట్. ఈ స్కూటర్‌లో విశాలమైన సీటు, వెడల్పైన ఫ్లోర్‌బోర్డ్ ప్రయాణికులకు ఎంతో సౌకర్యాన్ని ఇస్తాయి. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే, ఇందులో ఏకంగా 56 లీటర్ల స్పేస్ ఉంది (34 లీటర్ల అండర్ సీట్, 22 లీటర్ల ఫ్రంట్ స్టోరేజ్). రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లలో ఇది లభిస్తుంది. 2.9 kWh బ్యాటరీతో 123 కిలోమీటర్ల రేంజ్, 3.7 kWh బ్యాటరీతో ఏకంగా 160 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీనివల్ల సిటీలో తిరిగే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అయింది.

రిజ్తా కేవలం కంఫర్ట్ మాత్రమే కాదు, టెక్నాలజీలో కూడా ముందుంది. ఇందులో స్కిడ్ కంట్రోల్, థీఫ్ అలర్ట్ (దొంగతనాల నుంచి రక్షణ), టో అలర్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. టాప్ మోడల్ అయిన Z వేరియంట్‌లో 17.7 సెంటీమీటర్ల టీఎఫ్‌టీ (TFT) డిస్‌ప్లే, గూగుల్ మ్యాప్స్ నావిగేషన్, లైవ్ లొకేషన్ షేరింగ్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించేటప్పుడు బ్యాక్‌రెస్ట్ సౌకర్యం కూడా ఉండటంతో మహిళలు, వృద్ధులు ఈ స్కూటర్ పట్ల మొగ్గు చూపుతున్నారు. రాబోయే రోజుల్లో ఈవీ మార్కెట్‌లో ఏథర్ రిజ్తా మరిన్ని సంచలనాలు 

Tags:    

Similar News