Daily Horoscope: ఆగస్టు 17 రాశిఫలాలు - శ్రావణ పంచమి ప్రభావంతో ఈ రాశుల జాతకంలో భారీ మార్పులు

ఆగస్టు 17 శ్రావణ పంచమి రోజున పలు రాశుల్లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్న సమయంలో పలు రాశులకు అదృష్టయోగం కలగనున్నది.

Update: 2026-08-17 01:58 GMT

Daily Horoscope: శ్రావణ మాసం అంటేనే ఆధ్యాత్మికతకు, దైవభక్తికి ప్రత్యేకమైన సమయం. ఈ పవిత్ర మాసంలోని శుక్ల పక్ష పంచమి తిథి అనేక రాశుల వారికి కొత్త ఆశలు, అవకాశాలను తీసుకురానుంది. శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువులో ఈ రోజు గ్రహ నక్షత్రాల ప్రభావం రాశులవారీగా భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ జీవితం, ఆరోగ్యం వంటి అంశాల్లో కొందరికి అనుకూల ఫలితాలు కనిపిస్తే.. మరికొందరు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ రోజు శ్రావణ శుక్ల పంచమి సాయంత్రం 05:00 గంటల వరకు కొనసాగి, అనంతరం షష్టి తిథి ప్రారంభమవుతుంది. చిత్త నక్షత్రం రాత్రి 04:58 గంటల వరకు ఉండి, ఆ తర్వాత స్వాతి నక్షత్రం వస్తుంది. శుభ యోగం రాత్రి 03:29 గంటల వరకు, అనంతరం శుక్ల యోగం ఉంటుంది. బాలవ కరణం సాయంత్రం 05:00 గంటల వరకు, తర్వాత కౌలవ కరణం కొనసాగుతుంది. అందువల్ల దైవారాధన, శుభసంకల్పాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఈ రోజు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

మేషరాశి

మేష రాశి వారికి కుటుంబపరంగా ఆనందకరమైన వాతావరణం కనిపిస్తుంది. చాలాకాలంగా కలవని బంధువులను కలుసుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు తలుపుతడతాయి. ఆర్థికంగా ఊహించని ప్రయోజనం కలగవచ్చు. కుటుంబంతో కలిసి తీర్థక్షేత్ర దర్శనం చేయడం మనశ్శాంతిని ఇస్తుంది.

వృషభరాశి

వృషభ రాశి వారికి ఆర్థిక విషయాల్లో ముందడుగు వేసే రోజు. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి ప్రశంసలు అందవచ్చు. వ్యాపారులకు కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఖర్చుల విషయంలో మాత్రం అవసరం, అనవసరం అనే తేడాను గుర్తించాలి.

మిథునరాశి

మిథున రాశి వారికి పనుల్లో వేగం పెరుగుతుంది. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుట్టేందుకు అనుకూలమైన సమయం. ఉద్యోగంలో ఎదుగుదలకు సంబంధించిన సమాచారం రావచ్చు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ప్రయాణాల్లో ఆలస్యం రాకుండా ముందస్తు ప్రణాళిక చేసుకోవాలి. కుటుంబ పెద్దల సూచనలు పాటిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

కర్కాటకరాశి

కర్కాటక రాశి వారు ఈ రోజు కొంత సంయమనంతో వ్యవహరించాలి. ఉద్యోగంలో చిన్న పొరపాటు కూడా ఇబ్బందిని కలిగించే అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టేముందు పూర్తిగా పరిశీలించాలి. ఆర్థికంగా ఒత్తిడి పెరగకుండా ఖర్చులను నియంత్రించండి. కుటుంబంలో చిన్నచిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి.

సింహరాశి

సింహ రాశి వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో మీ సామర్థ్యాన్ని ఉన్నతాధికారులు గుర్తిస్తారు. వ్యాపారంలో పోటీని సమర్థంగా ఎదుర్కొంటారు. గతంలో నిలిచిపోయిన ఆర్థిక వ్యవహారం ఒకటి కొలిక్కి రావచ్చు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

కన్యారాశి

కన్య రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పురోగతి కనిపిస్తుంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త వినే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు బలపడతాయి. కుటుంబ సభ్యులతో చేసే ప్రయాణం ఆనందాన్ని ఇస్తుంది. ఆరోగ్యపరంగా పెద్దగా ఇబ్బందులు ఉండవు.

తులారాశి

తుల రాశి వారికి ఈ రోజు అప్రమత్తత చాలా అవసరం. అనుకోని పరిణామాలు కొంత అసౌకర్యాన్ని కలిగించవచ్చు. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. వ్యాపార ప్రయాణాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల్లో తొందరపడకండి. విలువైన వస్తువులు, పత్రాల విషయంలో జాగ్రత్త వహించండి.

వృశ్చికరాశి

వృశ్చిక రాశి వారికి అనుకూలమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగం, వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించిన సమాచారం అందుతుంది. వ్యాపార ఒప్పందాలు లాభాలను అందించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సలహాలు కీలక నిర్ణయాల్లో ఉపయోగపడతాయి. ఆదాయం పెరిగినా ఖర్చులను కూడా అదుపులో ఉంచాలి.

ధనస్సురాశి

ధనుస్సు రాశి వారికి ప్రారంభించిన పనులు ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో బాధ్యతలు, హోదా పెరిగే అవకాశం ఉంది. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది.

మకరరాశి

మకర రాశి వారికి వృత్తిపరంగా మంచి పరిణామాలు కనిపిస్తాయి. విదేశీ ప్రయాణాలు లేదా విదేశీ సంబంధిత పనుల్లో ఉన్న అడ్డంకులు తొలగే అవకాశం ఉంది. ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఆలయ దర్శనం మనసులోని ఆందోళనలను తగ్గిస్తుంది.

కుంభరాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నిజాయితీగా వ్యవహరించినా కొన్ని అనుకోని సమస్యలు ఎదురుకావచ్చు. ముఖ్యమైన పనుల్లో ఇతరుల సహకారం అవసరం అవుతుంది. కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టడాన్ని కొంతకాలం వాయిదా వేయడం మంచిది. వాదోపవాదాలకు దూరంగా ఉండండి.

మీనరాశి

మీన రాశి వారికి దైవబలం తోడుగా ఉంటుంది. అనుకున్న పనుల్లో కొన్ని సఫలమయ్యే అవకాశం ఉంది. అయితే వ్యాపారంలో అనుకోని ఖర్చులు లేదా స్వల్ప ఆర్థిక నష్టం ఎదురుకావచ్చు. ప్రయాణాలు, అవసరం లేని ఖర్చులను తగ్గించండి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మాటపై నియంత్రణ అవసరం. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి.

గమనికః ఇక్కడ ఇచ్చినవి కేవలం సామాన్యమైన ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతక ఫలితాల కోసం నిపుణులైన జ్యోతిష్య పండితులను సంప్రదించండి.  

Tags:    

Similar News