Astrology: అరుదైన పరివ‌ర్త యోగం.. ఆగ‌స్టు 8 నుంచి ఈ రాశుల వారు ప‌ట్టింద‌ల్లా బంగార‌మే

Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారంలో జరిగే కొన్ని ప్రత్యేక యోగాలు కొందరి జీవితాల్లో అనుకూల మార్పులకు కారణమవుతాయని విశ్వసిస్తారు.

Update: 2026-08-07 10:21 GMT

Astrology: అరుదైన పరివ‌ర్త యోగం.. ఆగ‌స్టు 8 నుంచి ఈ రాశుల వారు ప‌ట్టింద‌ల్లా బంగార‌మే

Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారంలో జరిగే కొన్ని ప్రత్యేక యోగాలు కొందరి జీవితాల్లో అనుకూల మార్పులకు కారణమవుతాయని విశ్వసిస్తారు. అలాంటి అరుదైన యోగాల్లో ఒకటిగా బుధుడు–చంద్రుడి పరివర్తన యోగంను భావిస్తారు. దీంతో కొన్ని రాశుల వారికి క‌లిసి రానుంద‌ని పండితులు చెబుతున్నారు.

ఆగస్టు 8 నుంచి మూడు రోజుల పాటు ఈ ప్రత్యేక యోగం ఏర్పడనుండగా, దీని ప్రభావం ఆగస్టు 22 వరకు కొనసాగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. బుధుడు కర్కాటక రాశిలో, చంద్రుడు మిథున రాశిలో సంచరించడం వల్ల ఈ పరివర్తన యోగం ఏర్పడుతోంది. దీని ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు, వృత్తిలో పురోగతి, కుటుంబ శుభవార్తలు వంటి అనేక అనుకూల ఫలితాలు కలిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

వృషభ రాశి వారికి ఆదాయం పెరిగే అవకాశాలు

ఈ పరివర్తన యోగం వల్ల వృషభ రాశివారికి ఆర్థిక పరిస్థితి మరింత బలపడే అవకాశం ఉందని చెబుతున్నారు. పెద్దగా శ్రమించకుండానే కొన్ని ఆదాయ అవకాశాలు రావచ్చు. కొత్త మార్గాల ద్వారా డబ్బు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు వేతన పెంపు లేదా అదనపు ప్రయోజనాలు లభించవచ్చు. వ్యాపారులకు లాభాలు ఆశించిన దానికంటే మెరుగ్గా ఉండే సూచనలు ఉన్నాయి. భూములు, ఆస్తులకు సంబంధించిన వివాదాలు అనుకూలంగా ముగిసే అవకాశం ఉంది. ఈ కాలంలో చేపట్టే ప్రయాణాలు కూడా ప్రయోజనకరంగా ఉండొచ్చని భావిస్తున్నారు.

మిథున, కన్య రాశుల వారికి కలిసి వచ్చే సమయం

మిథున రాశివారికి ఈ యోగం ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఇవ్వవచ్చని జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొనడంతో పాటు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఆస్తి వ్యవహారాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకోవచ్చు. ఉద్యోగం, వ్యాపారం రెండింటిలోనూ పురోగతి కనిపించే అవకాశముంది.

కన్య రాశివారికి విదేశీ ప్రయాణాలు లేదా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో పదోన్నతి, బాధ్యతలు పెరగడం, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం వంటి అవకాశాలు ఉండొచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు, కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

తుల, కుంభ రాశుల వారికి కెరీర్‌లో కొత్త మలుపు

తుల రాశివారికి ఈ పరివర్తన యోగం కెరీర్ పరంగా అనుకూలంగా ఉండవచ్చని భావిస్తున్నారు. విదేశీ కంపెనీల నుంచి ఉద్యోగ అవకాశాలు రావడం లేదా ఇతర ప్రాంతాల్లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టే పరిస్థితులు ఏర్పడవచ్చు. సమాజంలో గౌరవం పెరగడంతో పాటు ప్రముఖులతో పరిచయాలు ఉపయోగపడే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టిన వారికి కొంత లాభం కనిపించే సూచనలు ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

కుంభ రాశివారికి ఈ కాలం విజయాలను అందించే అవకాశముందని పండితులు చెబుతున్నారు. ఉద్యోగంలో ప్రతిభకు గుర్తింపు లభించవచ్చు. వ్యాపారులు విస్తరణ దిశగా అడుగులు వేయవచ్చు. రాజకీయాలు లేదా ప్రజా జీవితంతో సంబంధం ఉన్నవారికి గుర్తింపు పెరిగే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా సానుకూల సమాచారం వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

మీన రాశి వారికి ధనలాభం, ఉద్యోగ పురోగతికి అవకాశం

మీన రాశివారికి ఈ పరివర్తన యోగం వల్ల ఉద్యోగం ద్వారా ఆదాయం పెరగడంతో పాటు అదనపు రాబడి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. కొత్త ఉద్యోగ అవకాశాలు రావడం లేదా ప్రస్తుతం ఉన్న ఉద్యోగంలో మెరుగైన స్థాయికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రతిభకు గుర్తింపు లభించడంతో పాటు ప్రభుత్వ స్థాయిలో గౌరవం దక్కే అవకాశాలు కూడా ఉండొచ్చని జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నాయి. షేర్లు, పెట్టుబడుల ద్వారా కొంత లాభం పొందే అవకాశం ఉందని, కుటుంబంలో పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వినే అవకాశమూ ఉందని పేర్కొంటున్నారు.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న అంశాలు జ్యోతిష్య శాస్త్ర విశ్వాసాలు, గ్రహస్థితుల ఆధారంగా మాత్రమే అందించ‌డ‌మైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడ‌ర్స్ గ‌మ‌నించాలి.

Tags:    

Similar News