Daily Horoscope: ఆగస్టు 3 రాశిఫలాలు - ఈరోజు ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే

ఆగస్టు 3వ తేదీన ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రోజు ఐదు రాశులకు అన్ని విధాలుగా కలిసి వస్తుందని జ్యోతిష్యపండితులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం.

Update: 2026-08-03 01:02 GMT

Daily Horoscope: ఆగస్టు 3, సోమవారం ఆషాఢ బహుళ పంచమి సందర్భంగా కొన్ని రాశుల వారికి శుభయోగాలు ఏర్పడగా, మరికొన్ని రాశుల వారు ఆచితూచి వ్యవహరించడం మంచిదని గ్రహస్థితులు సూచిస్తున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ఆరోగ్యం, ప్రయాణాలు, పెట్టుబడులు వంటి అంశాల్లో ఈరోజు ఏ రాశికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం.

మేషరాశి

ఈరోజు మీ శ్రమకు తగిన ఫలితం వెంటనే కనిపించకపోయినా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. పనిభారం పెరిగే సూచనలు ఉన్నాయి. మానసికంగా కొంత ఒత్తిడి అనిపించినా సమయపాలనతో అన్ని పనులను పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపే అవకాశం ఉంది. సమాజానికి ఉపయోగపడే పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ మంచి స్వభావానికి ప్రశంసలు దక్కుతాయి.

వృషభరాశి

ఈరోజు ప్రారంభించిన పనులు ఆశించిన దానికంటే వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. వ్యాపారంలో పెండింగ్ పనులు పూర్తవుతాయి. సన్నిహితుల సహాయం వల్ల ఒక ముఖ్యమైన పని విజయవంతంగా ముగుస్తుంది. ఆర్థికంగా కూడా స్థిరత్వం కనిపిస్తుంది.

మిథునరాశి

అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున ఆర్థిక వ్యవహారాల్లో నియంత్రణ అవసరం. ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు రావచ్చు. ఇతరుల మాటలను పూర్తిగా నమ్మకుండా స్వయంగా పరిశీలించడం మంచిది. వాహనం కొనుగోలు చేయాలనుకునేవారికి అనుకూల సమయం కనిపిస్తోంది. పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించడం మంచిది.

కర్కాటకరాశి

ఈరోజు కొంత శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ మీ కృషి వృథా కాదు. ఆలస్యంగా అయినా పనులు పూర్తి అవుతాయి. వ్యాపారంలో చిన్న ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగాలి. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకండి. అవసరం లేని వాదనలు, వివాదాలకు దూరంగా ఉంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది.

సింహరాశి

ఈరోజు మీ ప్రతిభకు గుర్తింపు లభించే రోజు. అదనపు ఆదాయం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. స్నేహితుల సహకారంతో కీలక పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు.

కన్యారాశి

ఈరోజు తొందపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి.  కుటుంబ సభ్యుల సలహాలు మీకు మేలు చేస్తాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. గృహానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది. పనులు నెమ్మదిగా సాగినా చివరకు అనుకూల ఫలితం వస్తుంది. సహనమే మీ బలం.

తులారాశి

మీ పట్టుదల ఈరోజు విజయానికి ప్రధాన కారణం అవుతుంది. వృత్తిపరంగా మంచి అవకాశాలు వస్తాయి. కొత్త ఆలోచనలు అమలులోకి వస్తాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి.

వృశ్చికరాశి

ఎంత కష్టమైన పని అయినా పూర్తి చేసే పట్టుదల ఈరోజు మీలో కనిపిస్తుంది. గతంలో నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. ఉద్యోగం, వ్యాపారంలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశముంది. మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది.

ధనస్సురాశి

భూమి, స్థిరాస్తులకు సంబంధించిన ఆలోచనలు ముందుకు సాగుతాయి. అనుభవజ్ఞుల సలహా తీసుకుని పెట్టుబడులు పెట్టడం మంచిది. ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా జీవనశైలిలో చిన్న మార్పులు చేసుకోవాలి. నిలిచిపోయిన పనులు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి.

మకరరాశి

ఈరోజు ప్రతి విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా విభేదాలు ఉన్న వ్యక్తులతో దూరం పాటించండి. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఆదాయంలో మార్పులు కనిపిస్తాయి. వివాహ ప్రయత్నాలు సానుకూల దిశగా కదులుతాయి. కొన్ని పనులు ఆలస్యం అయినా చివరకు పూర్తి అవుతాయి.

కుంభరాశి

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఈరోజు మంచి విజయాలు సాధిస్తారు. సమాజంలో మీ పేరు ప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి. అప్పుల భారం తగ్గించే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభించవచ్చు. సన్నిహితుల సహకారం వల్ల ఒక ముఖ్యమైన బాధ్యతను విజయవంతంగా పూర్తి చేస్తారు.

మీనరాశి

ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. భూమి, స్థిరాస్తులపై పెట్టుబడుల విషయంలో తొందరపడకండి. భాగస్వామ్య వ్యాపారాల్లో పూర్తి అవగాహనతో ముందుకు వెళ్లాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ గుడ్డిగా నమ్మకుండా పరిస్థితులను అర్థం చేసుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల సహకారంతో కొత్త బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తారు.

గమనికః ఇక్కడ ఇచ్చినవి కేవలం సామాన్యమైన ఫలితాలు మాత్రమే. పూర్తిస్థాయి వ్యక్తిగత జాతక ఫలితాల కోసం నిపుణులైన జ్యోతిష్యపండితులను సంప్రదించండి.

Tags:    

Similar News