Astrology: రాహువు తిరోగమనం.. ఈ రాశుల వారు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన స‌మ‌యం

Astrology: జ్యోతిష్య శాస్త్రంలో రాహువుకు ప్రత్యేక స్థానం ఉంది. దీనిని ఛాయా గ్రహంగా పరిగణిస్తారు.

Update: 2026-08-09 09:21 GMT

Astrology: రాహువు తిరోగమనం.. ఈ రాశుల వారు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన స‌మ‌యం

Astrology: జ్యోతిష్య శాస్త్రంలో రాహువుకు ప్రత్యేక స్థానం ఉంది. దీనిని ఛాయా గ్రహంగా పరిగణిస్తారు. రాహువు ఒక రాశి నుంచి మరో రాశికి మారడం లేదా తిరోగమనంలో ప్రయాణించడం వల్ల కొన్ని రాశుల వారిపై ప్రతికూల ప్రభావం పడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు. ప్రస్తుతం రాహువు తిరోగమన ప్రభావం ప్రారంభమైన నేపథ్యంలో కొన్ని రాశుల వారు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచిస్తున్నారు.

కర్కాటక రాశి.. కుటుంబం, ఆర్థిక విషయాల్లో జాగ్రత్త

జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కర్కాటక రాశి వారికి ఈ సమయంలో కుటుంబానికి సంబంధించిన చిన్న చిన్న విభేదాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది. ఇంట్లో అపార్థాలు, అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఖర్చులు కూడా అనూహ్యంగా పెరిగే సూచనలు ఉన్నాయని చెబుతున్నారు. అవసరం లేని ఖర్చులను తగ్గించడం, ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిదని సూచిస్తున్నారు.

కన్యా రాశి.. ఆరోగ్యం, చదువు, వ్యాపారంలో ఒత్తిడి

కన్యా రాశి వారికి ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. చాలాకాలంగా ఉన్న ఆరోగ్య సమస్యలు మళ్లీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని అంటున్నారు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు పొందాలంటే మరింత శ్రమించాల్సి రావచ్చు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టే ముందు అన్ని అంశాలను పరిశీలించడం మంచిదని సూచిస్తున్నారు. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం మేలు చేస్తుందని చెబుతున్నారు.

మకర రాశి.. పెట్టుబడులు, అప్పుల విషయంలో అప్రమత్తం

మకర రాశి వారికి ఆదాయం వచ్చినా అదే వేగంతో ఖర్చులు పెరిగే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్లేషకులు చెబుతున్నారు. కొత్త పెట్టుబడులు పెట్టడం లేదా పెద్ద మొత్తంలో ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం కొంతకాలం వాయిదా వేయడం మంచిదని సూచిస్తున్నారు. అప్పులు తీసుకునే పరిస్థితి వస్తే పూర్తిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, ప్రతి అడుగును జాగ్రత్తగా వేస్తే అనవసర ఇబ్బందులను కొంతవరకు నివారించవచ్చని పేర్కొంటున్నారు.

కుంభ రాశి.. మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం ముఖ్యం

కుంభ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు ఆందోళన కలిగించవచ్చని, ఊహించని సంఘటనలు మానసిక ఒత్తిడిని పెంచవచ్చని చెబుతున్నారు. ఇతరులతో వ్యవహరించే సమయంలో అహంకారానికి దూరంగా ఉండి, సహనంతో వ్యవహరిస్తే అనేక సమస్యలను అధిగమించవచ్చని సూచిస్తున్నారు.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న వివరాలు పూర్తిగా జ్యోతిష్య విశ్వాసాలు, పండితుల అభిప్రాయాల ఆధారంగా మాత్రమే అందించ‌డ‌మైంది. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవ‌ని రీడ‌ర్స్ గ‌మ‌నించాలి.

Tags:    

Similar News