Anantapur: హానీ ట్రాప్ కేసులో సంచలనం.. నలుగురు పోలీసులు డిస్మిస్.. ముగ్గురు సస్పెన్షన్!
Anantapur: అనంతపురం జిల్లాలో సంచలనం రేపిన హానీ ట్రాప్ కేసులో పోలీసు అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. నలుగురిని డిస్మిస్ చేయగా, ముగ్గురిని సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
Anantapur: హానీ ట్రాప్ కేసులో సంచలనం.. నలుగురు పోలీసులు డిస్మిస్.. ముగ్గురు సస్పెన్షన్!
Anantapur Honey Trap Case: అనంతపురం జిల్లాలో వెలుగుచూసిన ‘హానీ ట్రాప్’ వ్యవహారంలో పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. ఈ కేసులో పోలీసుల ప్రమేయం ఉన్నట్లు తేలడంతో ఉన్నతాధికారులు కొరడా ఝళిపించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి, నేరస్తులతో చేతులు కలిపిన నలుగురు పోలీసులను ఉద్యోగం నుంచి తొలగించగా (డిస్మిస్), మరో ముగ్గురిని సస్పెండ్ చేశారు.
హానీ ట్రాప్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాప్తాడు సీఐ హర్ష, హెడ్ కానిస్టేబుల్ గిరి, కానిస్టేబుళ్లు దుర్గా, దేవ నాయక్‌లను సర్వీసు నుంచి తొలగిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు అనంతపురం రూరల్ ఎస్ఐ రాంబాబుతో పాటు కానిస్టేబుళ్లు దేవేంద్ర, జయనాయక్‌లపై సస్పెన్షన్ వేటు వేశారు. అలాగే, అనంతపురం రూరల్ సీఐగా విధులు నిర్వహిస్తున్న శేఖర్‌ను కర్నూలు వీఆర్ (Vacaney Reserve) కు అటాచ్ చేశారు.
ఈ హానీ ట్రాప్ కేసులో ఇప్పటికే పోలీసులు మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. రక్షించాల్సిన పోలీసులే ఈ ముఠాకు సహకరించడం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. ఈ దర్యాప్తులో మరిన్ని దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని, విచారణ కొనసాగుతోందని ఉన్నతాధికారులు వెల్లడించారు. బాధ్యులైన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.