Hindupur: హిందూపురం మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి మైనార్టీలకే ఇవ్వాలి!

హిందూపురం: శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో ముస్లిం మైనార్టీ కి చెందిన 18 మంది కౌన్సిలర్ గా ఎన్నిక కావడంతో మా సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చి హిందూపురం మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల నుండి ఆనవాయితీగా హిందూ సామాజిక వర్గానికి చెందిన చైర్మన్ పదవి ఉంటే వైస్ చైర్మన్ పదవి మైనార్టీలకు ఇచ్చి గౌరవిస్తూ వస్తున్నారు.

ఈ తరుణంలోనే ఈసారి కూడా ముస్లిం మైనార్టీ కి చెందిన ఎవరికో ఒకరికి వైస్ చైర్మన్ పదవి ఇవ్వాలని ముస్లిం మత పెద్దలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా రెండు సంవత్సరాల కాలవ్యవధిలోనే శాసనసభ ఎన్నికలు ఉన్నందున ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముస్లిం మైనార్టీలకు తగిన ప్రాధాన్యత ఇచ్చి గౌరవించాలని వారు కోరారు.

Tags: