Rayadurgam: కానిస్టేబుల్ షేక్ ఖాసీం పుట్టినరోజున నిరుపేదలకు అన్నదానం
Rayadurgam: రాయదుర్గంలో పోలీస్ కానిస్టేబుల్ షేక్ ఖాసీం పుట్టినరోజు సందర్భంగా సేవా భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.
Rayadurgam: కానిస్టేబుల్ షేక్ ఖాసీం పుట్టినరోజున నిరుపేదలకు అన్నదానం
రాయదుర్గం: పోలీస్ కానిస్టేబుల్ షేక్ ఖాసీం గారి జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాయదుర్గం పట్టణంలోని నిరుపేదలకు ఆహారం పొట్లాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు జి. గంగారామ్ మాట్లాడుతూ, ప్రజల భద్రత కోసం విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అంకితభావంతో పనిచేస్తూనే, సామాజిక సేవలోనూ ముందుండి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్న షేక్ ఖాసీం గారు అభినందనీయులని అన్నారు.
అలాగే, తన పుట్టిన ఊరు మరియు తాను చదువుకున్న పాఠశాలపై ఉన్న ప్రేమతో, ఉద్యోగం వచ్చిన అనంతరం తన నెల జీతాన్ని సైతం పాఠశాల అభివృద్ధికి విరాళంగా అందించిన గొప్ప మనసున్న వ్యక్తి షేక్ ఖాసీం గారు అని కొనియాడారు.
అటువంటి సేవాభావం కలిగిన వ్యక్తి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు నిరుపేదలకు అన్నదానం నిర్వహించడం తమకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని, ప్రతి ఒక్కరూ తమ జన్మదినాలు, వివాహ వార్షికోత్సవాలు వంటి ప్రత్యేక సందర్భాలను సామాజిక సేవకు అంకితం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.