Anantapur: అనంతపురంలో వైసీపీపై మంత్రి పయ్యావుల తీవ్ర విమర్శలు!
Anantapur: జేఎన్టీయూలో జరిగిన షైనింగ్ స్టార్స్ 2026 సదస్సులో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ హంద్రీనీవా ప్రాజెక్టు పనులపై వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు.
Anantapur: అనంతపురంలో వైసీపీపై మంత్రి పయ్యావుల తీవ్ర విమర్శలు!
అనంతపూర్: హంద్రీనీవా కాలువలో గత 5 ఏళ్లలో వైసీపీ నాయకులు గంప మట్టిని కూడా తీయలేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పర్యావరణ కేశవ్ అన్నారు.. అనంతపురంలోని జేఎన్టీయూ ఎన్టీఆర్ ఆడిటోరియంలో షైనింగ్ స్టార్స్ 2026 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వైసీపీ నాయకుల పై తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలోనే రికార్డు స్థాయిలో లైనింగ్ పనులు జిల్లాకు నీటిని తీసుకువచ్చామన్నారు లోపాలు జరిగాయని విమర్శించిన వైసీపీ నాయకులు నిరూపించకపోతే కేసులు ఎదుర్కొంటారని హెచ్చరించారు.
ప్రజల కోసం బాధ్యతగా పనిచేస్తున్నామని మరింత పని చేయాల్సి ఉందన్నారు బట్ట కాల్చి మోహన వేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు టీటీడీలో పింక్ డైమండ్ పోయిందని కేసు వేస్తే గత ప్రభుత్వం వచ్చాక కేసును రద్దు చేయించుకున్నారన్నారు జిల్లాలో ఏమి చేయకపోవడంతో వైసీపీ ఉనికిని కోల్పోతుందన్నారు రాష్ట్ర చరిత్రలో ఒక ఏడాదిలో ప్రాజెక్టు మీద 3800 కోట్లు రెండో ఏడాదిలో 11 వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు.
గతంలో కనీసం మూడు కోట్లు ఖర్చు పెట్టలేనోళ్లు ఇవాళ మాట్లాడుతున్నారని ప్రశ్నించారు నెల్లూరులో విశ్వేశ్వర్ రెడ్డి మనసులో ఉన్న మాట మాట్లాడారని కూటమి ప్రభుత్వంలో రాయలసీమలో హంద్రీనీవా పనులు అద్భుతంగా జరుగుతున్నాయన్నారు ఆత్మ సాక్షిగా ఒక మాట సాక్షి కోసం మరో మాట మాట్లాడుతున్నారని చెప్పారు గత ఐదేళ్లు ఒక్క ప్రాజెక్టు గురించి మాట్లాడలేని వాళ్లు ఇవాళ పాదయాత్రలు చేస్తున్నారన్నారు విమర్శలు మానేసి ప్రజల కోసం పనిచేయాలని చెప్పారు.