Anantapur: ఘోర రోడ్డు ప్రమాదం.. కారు అదుపుతప్పి ఇద్దరు మృతి!
Anantapur: రమనేపల్లి వద్ద కారు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ప్రమాదంలో ఇద్దరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు. ఘటనపై ఎమ్మెల్యే సురేంద్రబాబు దిగ్భ్రాంతి.
Anantapur: ఘోర రోడ్డు ప్రమాదం.. కారు అదుపుతప్పి ఇద్దరు మృతి!
Anantapur: అనంతపురం జిల్లా రమనేపల్లి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రులను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తరలించినట్లు వైద్యులు తెలిపారు.
మృతులు కళ్యాణదుర్గానికి చెందిన లలిత బట్టల దుకాణం బెలుగుప్ప నాగరాజు, ఉపాధ్యాయుడు రాఘవేంద్రగా అధికారులు గుర్తించారు. ఘటనపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.