Vijayawada: జనసేన వీర మహిళలకు స్ఫూర్తి.. కదిలింది ఇక జనసేన!
Vijayawada: జనసేన పార్టీలో మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో రూపొందించిన “కదిలింది ఇక జనసేన... కదం తొక్కు వీర మహిళ” ప్రత్యేక గీతాన్ని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ విజయవాడలో ఆవిష్కరించారు.
Vijayawada: జనసేన వీర మహిళలకు స్ఫూర్తి.. కదిలింది ఇక జనసేన!
విజయవాడ: కృష్ణా-పెన్నా రీజినల్ కోఆర్డినేటర్ రావి సౌజన్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భవానీపురం 43వ డివిజన్ జనసేన పార్టీ కోఆర్డినేటర్, విజయేశ్వర స్వామి దేవాలయ బోర్డు సభ్యురాలు ఆలమూరి శ్రీదేవి ఈ పాటను నిర్మించారు. పార్టీ మహిళా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు, రాజకీయాల్లో మహిళలు మరింత చురుగ్గా ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈ గీతాన్ని రూపొందించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా మహిళలు రాజకీయ రంగంలో మరింతగా రాణించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళల సాహసం, పోరాట పటిమ, ప్రజాస్వామ్య పరిరక్షణలో వారు పోషిస్తున్న కీలక పాత్రను ప్రతిబింబించేలా పాటను రూపొందించడం అభినందనీయమని పేర్కొన్నారు.
జనసేన వీర మహిళలకు ఈ గీతం ఒక నినాదంలా, స్ఫూర్తి గీతంలా నిలుస్తుందని అన్నారు. మహిళా శక్తిని రాజకీయ, సామాజిక రంగాల్లో మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.
మహిళలు కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితం కాకుండా నిర్ణయాత్మక రాజకీయాల్లో భాగస్వాములు కావాలనే సందేశాన్ని ఈ పాట బలంగా వినిపిస్తోంది. పార్టీ కార్యక్రమాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు, ప్రజా సమస్యలపై వారి గొంతును మరింత బలంగా వినిపించేలా ఈ గీతం ఉత్సాహాన్ని కలిగించనుంది. దీంతో జనసేన వీర మహిళల్లో కొత్త ఉత్సాహం నింపే స్ఫూర్తి గీతంగా ఇది నిలవనుంది.