Adilabad: ఆదిలాబాద్లో వ్యవసాయ డ్రోన్ల వాడకంపై శిక్షణ తరగతులు!
Adilabad: ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో గ్రామీణ యువతకు డ్రోన్ల వాడకంపై శిక్షణ ఇచ్చారు. త్వరలో 10 మంది ఆదివాసి మహిళలకు రాయితీపై డ్రోన్లు అందించనున్నారు.
Adilabad: ఆదిలాబాద్లో వ్యవసాయ డ్రోన్ల వాడకంపై శిక్షణ తరగతులు!
అదిలాబాద్ జిల్లా: పాతకాలం పద్ధతులు చెప్పి ఆధునిక వ్యవసాయం వైపు గ్రామీణ యువత అడుగులు వేసేందుకు ప్రభుత్వపరంగా ఏర్పాట్లు చేపట్టింది... ఇప్పటికే సాంకేతిక పరంగా వ్యవసాయ రంగంలో చోటు చేసుకుంటున్నా విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా డ్రోన్ వాడకంపై గ్రామీణ యువతి, యువకులకు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ వృత్తిపరంగా శిక్షణను ఇస్తూ వారిలో చైతన్యం కల్పిస్తున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు... అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో డ్రోన్ వాడకంపై ప్రోత్సహిస్తున్నారు.
ఇటీవల కాలంలో సాంకేతిక పరంగా వ్యవసాయ రంగంలో పలు విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి.. పంటల విత్తనాలు వేసే మొదలు పురుగు మందు పిచికారీల కోసం డ్రోన్ వాడకం పెరిగిపోయింది.. డ్రోన్ వాడటం వల్ల సత్ఫలితాలు వస్తుండడంతో ప్రభుత్వం కూడా డ్రోన్ల వాడకాన్ని ప్రోత్సహిస్తుంది.. ఇందులో భాగంగా వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నిష్ణాతులైన టెక్నీషియన్ లతో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.
మహిత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో త్వరలోనే శిక్షణ పొందిన ఆదివాసి మహిళలకు స్వయం ఉపాధి పథకంలో భాగంగా 10 మంది మహిళలకు రాయితీపై పంపిణీ చేయనున్నారు.. సాంకేతిక పరంగా ఇద్దరికీ రెండు డ్రోన్లను పంపిణీ చేశారు.. వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చిత్రు, వ్యవసాయ పరిశోధన స్థానం ఇన్చార్జి వర్మ, కేవీకే ఇన్చార్జ్ శ్రీధర్ చౌహన్, పలువురు వ్యవసాయ శాస్త్రవేత్తలు, రైతు సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు.