Neradigonda: దొంగల బీభత్సం ఒకేసారి నాలుగు ఇళ్లలో చోరీ యత్నం!

Neradigonda: నేరడిగొండ మండల కేంద్రంలో గుర్తుతెలియని దొంగలు ఒకేసారి నాలుగు ఇళ్లలో చోరీకి యత్నించారు.

Update: 2026-07-31 07:59 GMT

Neradigonda: దొంగల బీభత్సం ఒకేసారి నాలుగు ఇళ్లలో చోరీ యత్నం!

Neradigonda: నేరడిగొండ మండల కేంద్రంలో ఈరోజు ఉదయం తెల్లవారుజామున గుర్తుతెలియని దొంగలు విరుచుకుపడ్డారు. ఒకేసారి నాలుగు ఇళ్లలో చోరికి యత్నించారని సమాచారం, బాధితుల సమాచారం ప్రకారం దొంగలు సుమారు రెండు వేల రూపాయల చిల్లర నగదును ఎత్తుకెళ్లినట్లు తెలిసింది.

విషయం తెలుసుకున్న వెంటనే నేరడిగొండ పోలీసులు వేగంగా స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు.

బాధితుల ఇళ్లను పరిశీలించిన పోలీసులు రంగంలోకి దిగి క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్ మరియు డాగ్ స్క్వాడ్ బృందాలను రప్పించి చోరికి పాల్పడ్డ ఇండ్లలో తనిఖీ చేయిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు.

అయితే గత కొన్ని రోజులుగా బోథ్, సోనాల, బజార్‌హత్నూర్ మండలాల్లో దొంగల భయం తీవ్రరూపం దాల్చింది. ముఖ్యంగా సోనాల మండల కేంద్రంలో పరిస్థితి మరీ దారుణంగా మారడంతో, గత వారం రోజులుగా ప్రతిరోజూ 20 మందికి పైగా గ్రామ యువకులు రాత్రివేళల్లో సొంతంగా గస్తీ నిర్వహిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తాజాగా నేరడిగొండ మండల కేంద్రంలోనూ ఒకే రోజు పలు ఇళ్లలో చోరీ యత్నాలు జరగడంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

Tags:    

Similar News