Nirmal: ఖానాపూర్: తెగిపోయిన వాగు వంతెనను పరిశీలించిన ఎస్పీ జానకి!
Nirmal: నిర్మల్: తెగిపోయిన రెంకొని వాగు వంతెనను పరిశీలించిన ఎస్పీ జానకి షర్మిల. మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు.
Nirmal: ఖానాపూర్: తెగిపోయిన వాగు వంతెనను పరిశీలించిన ఎస్పీ జానకి!
భారీ వర్షాలకు తెగిపోయిన రెంకొని వాగు తాత్కాలిక వంతెనను పరిశీలించిన నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల
నిర్మల్ జిల్లా//ఖానాపూర్ పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలను జిల్లా ఎస్పీ జానకి షర్మిల సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా వరద ఉధృతికి తెగిపోయిన రెంకొని వాగు తాత్కాలిక వంతెనను పరిశీలించి, సంబంధిత అధికారులతో పరిస్థితిపై సమీక్షించారు
వాగుకు అవతల ఉన్న తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ (TMREIS) విద్యార్థుల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు అత్యంత అ
ప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులు మినహా ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. అలాగే వరద ప్రవాహం ఉన్న వాగులు, చెరువుల్లోకి వెళ్లడం, ఈత కొట్టడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు...