Adilabad: ఉగ్రరూపం దాల్చిన పొచ్చెర జలపాతం!

Adilabad: ఆదిలాబాద్‌ జిల్లాలో భారీ వర్షాల కారణంగా పొచ్చెర జలపాతం ఉగ్రరూపం దాల్చింది.

Update: 2026-07-30 05:10 GMT

Adilabad: ఉగ్రరూపం దాల్చిన పొచ్చెర జలపాతం!

Adilabad: ​ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా గడిచిన రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పొచ్చెర జలపాతం ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో జలపాతం హోరెత్తుతూ భయానక వాతావరణాన్ని తలపిస్తోంది.

నిన్నటితో పోలిస్తే ఈరోజు వరద ఉధృతి ప్రమాదకర స్థాయిలో పెరగడంతో అటవీశాఖ యంత్రాంగం తక్షణ చర్యలు చేపట్టింది.

పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జలపాతం వద్దకు ఎవరినీ అనుమతించడం లేదు. ముందస్తు జాగ్రత్తగా పర్యాటక కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేసారు, వరద ఉధృతి తగ్గేవరకు పర్యాటకులు ఎవరూ జలపాతం వైపు రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News