Nirmal: నిర్మల్‌లో ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి వివాహిత ఆత్మహత్యాయత్నం!
Nirmal: నిర్మల్ శివాజీ చౌక్ వద్ద నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనంపై నుంచి సారంగాపూర్ మండలం లక్ష్మీపూర్‌కు చెందిన సంగీత బుధవారం దూకి ఆత్మహత్యాయత్నం చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి.
Nirmal: నిర్మల్‌లో ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి వివాహిత ఆత్మహత్యాయత్నం!
నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్ వద్దగల ఐదంతస్తుల నిర్మాణంలో ఉన్న భవనం పై నుంచి వివాహిత దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కలకలం రేపింది. సారంగాపూర్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన సంగీత అనే వివాహిత కుటుంబ కలహాలతో భవనం పైకి ఎక్కి ఆత్మహత్యకు పాల్పడేందుకు సిద్ధమైంది.
విషయాన్ని తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కింది నుంచి స్థానికులు పోలీసులు దూకవద్దని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఒక్కసారిగా అందరూ చూస్తుండగానే భవనం పై నుంచి కిందికి దూకింది.
తీవ్ర గాయాల పాలైన సంగీతను హుటాహుటిన అంబులెన్స్ లో జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. సుమారు గంటసేపు ఆత్మహత్యకు పాల్పడవద్దని ఎంత నచ్చే చెప్పిన వినకుండా ఒక్కసారిగా భవనం పై నుండి దూకడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.