Gudihatnur: ఎరువుల విక్రయాలపై డీలర్లకు వ్యవసాయాధికారి ఆదేశాలు
Gudihatnur: గుడిహత్నూర్ మండలంలో ఎరువులు, పురుగు మందుల డీలర్లతో సమావేశం. FFS యాప్ వినియోగం, నిబంధనలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన మండల వ్యవసాయ అధికారి.
Gudihatnur: ఎరువుల విక్రయాలపై డీలర్లకు వ్యవసాయాధికారి ఆదేశాలు
గుడిహత్నూర్: మండల వ్యవసాయ అధికారి భగత్ రమేష్ కార్యాలయంలో విత్తనాలు, ఎరువుల డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఫార్మర్ ఫర్టిలైజర్ సేల్ (FFS) యాప్ ద్వారా రైతులు పంటల వారీగా యూరియా, డీఏపీ, ఎంఓపీ మరియు కాంప్లెక్స్ ఎరువులను ఎలా బుక్ చేసుకోవాలో వివరించారు.
రైతులు వివిధ రకాల ఎరువుల కొనుగోలు కోసం దుకాణాలకు వచ్చినప్పుడు ఈ యాప్‌పై తగిన అవగాహన కల్పించాలని డీలర్లకు సూచించారు.
అలాగే క్రిమిసంహారక మందులు, ఎరువులు విక్రయించే సమయంలో పంట విస్తీర్ణానికి అనుగుణంగా, పురుగులు మరియు తెగుళ్లను గుర్తించి సరైన మోతాదులో మాత్రమే పిచికారీ మందులు వాడేలా రైతులకు స్పష్టమైన సూచనలు ఇవ్వాలని ఆదేశించారు.
డీలర్లు తప్పనిసరిగా ప్రతిరోజూ స్టాక్ రిజిస్టర్, స్టాక్ బోర్డును అప్‌డేట్ చేయాలని, రైతులకు పూర్తి వివరాలతో కూడిన రశీదులను ఇవ్వాలని స్పష్టం చేశారు. గడువు తీరిన (ఎక్స్‌పైరీ) మందులు విక్రయించినా, ఎం.ఆర్.పి ధర కంటే ఎక్కువకు అమ్మినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి భగత్ రమేష్‌తో పాటు మండలంలోని విత్తన, ఎరువుల మరియు పురుగు మందుల డీలర్లు పాల్గొన్నారు.