Khanapur: ఖానాపూర్‌లో ముత్తూట్ సిబ్బందిపై కస్టమర్ల ఆగ్రహం!

Khanapur: ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్‌లో తాకట్టు పెట్టిన బంగారాన్ని తిరిగి ఇచ్చేందుకు సిబ్బంది తీవ్ర జాప్యం చేస్తుండటంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Update: 2026-08-18 10:55 GMT

Khanapur: ఖానాపూర్‌లో ముత్తూట్ సిబ్బందిపై కస్టమర్ల ఆగ్రహం!

ఖానాపూర్: ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని ముత్తుట్ ఫైనాన్స్ లో తాకట్టు పెట్టిన బంగారం కస్టమర్లకు ఇవ్వకుండా సతాయిస్తు సిబ్బంది.. గందరగోళం లో వినియోగదారులు. తాకట్టు పెట్టిన బంగారాన్ని గత 15 రోజుల క్రితం విడిపించేందుకు వచ్చిన కస్టమర్లకు రేపు రండి ఎల్లుండి రండి మా సార్ లేరు అంటూ కాలక్షేపం.

గత 5 రోజుల క్రితం బంగారం ఇడిపించేందుకు వచ్చిన మరో కస్టమర్ ని మళ్ళీ రండి అని తెలుపగా అదే కస్టమర్ ఈ రోజు ముత్తూట్ లకు వెళ్లి అడుగగా అదే సాకులు చెబుతూ ఇబ్బంది పెడుతున్నారంటూ వాపోతున్నా వినియోగదారులు.

Tags:    

Similar News