Echoda: వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే ఉరే దిక్కు: ముఖరా (కె) రైతుల వినూత్న నిరసన

Echoda: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా (కె)లో రైతుల వినూత్న నిరసన.

Update: 2026-05-30 06:28 GMT

Echoda: వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే ఉరే దిక్కు: ముఖరా (కె) రైతుల వినూత్న నిరసన

Echoda: వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా (కె) గ్రామ రైతులు ట్రాన్స్‌ఫార్మర్ వద్ద చేతిలో ఉరితాళ్లతో వినూత్న నిరసన చేపట్టారు.

గత కేసీఆర్ ప్రభుత్వం కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా ప్రాణం పోయినా మీటర్లు పెట్టనని రైతులను ఆదుకుందని, కానీ ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్రంతో కుమ్మక్కై మోటార్లకు మీటర్లు పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. కాంగ్రెస్ పాలనలో ఇప్పటికే రుణమాఫీ, రైతుభరోసా పూర్తిస్థాయిలో అందక, పంటల కొనుగోళ్లు సాగక అల్లాడుతున్నామని, ఇప్పుడు మోటార్లకు మీటర్లు కూడా పెడితే రైతులకు చావే దిక్కవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్‌లతో పాటు పలువురు స్థానిక నాయకులు, రైతులు పాల్గొని ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News