Adilabad: అమ్మ మాట - అంగన్‌వాడీ బాటను విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ రాజర్షి షా

Adilabad: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, పోషణే ధ్యేయంగా కార్యక్రమం ప్రారంభం.

Update: 2026-05-30 10:22 GMT

Adilabad: అమ్మ మాట - అంగన్‌వాడీ బాటను విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్: గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారుల సమగ్ర ఆరోగ్యం, పోషణే ధ్యేయంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన "అమ్మ మాట - అంగన్‌వాడీ బాట" కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని అదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. శనివారం స్థానిక రిక్షా కాలనీ నందు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన "అమ్మ మాట - అంగన్‌వాడీ బాట" కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లభించే విభిన్న సేవలను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేలా అధికారులు విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలు మన పిల్లల ప్రగతికి పునాది అని, చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు, తల్లుల సంరక్షణకు జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.

"అమ్మ మాట - అంగన్‌వాడీ బాట" పథకం ద్వారా లబ్ధిదారులకు అందుతున్న సేవల ప్రాధాన్యతను వివరించారు. గర్భిణీ స్త్రీలకు గర్భధారణ సమయం నుండి తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన సంపూర్ణ పౌష్టికాహారాన్ని, బలాన్నిచ్చే ఆహార పదార్ధాలను అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లోపం లేకుండా అందించాలని పేర్కొన్నారు.

Tags:    

Similar News