Adilabad: హమాలీల ధర్నా నెలకోసారే రేషన్ ఇవ్విలి, వేతనాలు చెల్లించాలి!

Adilabad: సివిల్ సప్లై హమాలీల సమస్యలు పరిష్కరించాలని ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా.

Update: 2026-07-20 11:32 GMT

Adilabad: హమాలీల ధర్నా నెలకోసారే రేషన్ ఇవ్విలి, వేతనాలు చెల్లించాలి!

Adilabad: సివిల్ సప్లై హమాలీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ కార్యదర్శి విలాస్ మాట్లాడుతూ.. మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడం వల్ల హమాలీలు శారీరక, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు.

రేషన్ నెలకు ఒక్కసారే పంపిణీ చేయాలని, ప్రతి నెల 10వ తేదీలోగా కార్మికులకు వేతన బిల్లులు చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హామాలి కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సిర్రదేవేందర్, తదితరులున్నారు.

Tags:    

Similar News