Adilabad: ఆదిలాబాద్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా చంద్రకాంత్
Adilabad: ఆదిలాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా చంద్రకాంత్ విజయం సాధించారు.
Adilabad: ఆదిలాబాద్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా చంద్రకాంత్
Adilabad: ఆదిలాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అధ్యక్ష పదవికి జరిగిన హోరాహోరీ పోరులో చంద్రకాంత్ తన ప్రత్యర్థి రాజేశ్వర్‌పై 237 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. చంద్రకాంత్‌కు 1376 ఓట్లు రాగా, రాజేశ్వర్‌కు 1139 ఓట్లు వచ్చాయి.
అనంతరం సంఘ భవనంలో ఆయనకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు పూలమాలలు, శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఏం సంఘం అభివృద్ధికి, కులస్తుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు చంద్రకాంత్ తెలిపారు.
తనకు ఎన్నికల్లో సహకరించిన, ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కులస్తులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.