YS Sharmila: సజ్జల గారూ.. ముందు మీ కథ మీరు చూసుకోండి

YS Sharmila: తెలంగాణ ప్రజల కోసమే ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు.

Update: 2023-11-06 11:15 GMT

YS Sharmila: సజ్జల గారూ.. ముందు మీ కథ మీరు చూసుకోండి

YS Sharmila: తెలంగాణ ప్రజల కోసమే ఎన్నికల నుంచి తప్పుకుంటున్నట్లు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. తన పోరాటం తెలంగాణ ప్రజల కోసమేనని ఆమె అన్నారు. తమ పార్టీ పోటీ చేయడం వల్ల కాంగ్రెస్ ఓటు చీలి కేసీఆర్‌కు మేలు జరిగే అవకాశం ఉండటంతో అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పుకున్నామని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం చరిత్రత్మక తప్పిదం చేయమని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి షర్మిల పలు వ్యాఖ్యలు చేశారు.

గతంలో తాను తెలంగాణలో కొత్త పార్టీ స్థాపించినప్పుడు తమకేమీ సంబంధం లేదన్న సజ్జల, ఇప్పుడు తాను కాంగ్రెస్ కు మద్దతిస్తుంటే ఎందుకు మాట్లాడుతున్నారని షర్మిల ప్రశ్నించారు. తాము మాత్రం సంబంధం లేదనే అనుకుంటున్నామని వ్యాఖ్యానించారు. ‘‘మాతో సంబంధం గురించి సజ్జలే సమాధానం చెప్పాలి. ఏపీలో రోడ్లు, విద్యుత్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్‌ బాహాటంగానే విమర్శించారు. ఆయన వ్యాఖ్యలపై సజ్జల ఏం సమాధానం చెబుతారు?సజ్జల గారూ.. ముందు మీ కథ మీరు చూసుకోండి’’ అని షర్మిల ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News