YS Sharmila: తెలంగాణను పట్టి పీడించే వైరస్ కేసిఆర్
YS Sharmila: ఉద్దెర మాటలు చెప్పే దొర కేసిఆర్
YS Sharmila: తెలంగాణను పట్టి పీడించే వైరస్ కేసిఆర్
YS Sharmila: తెలంగాణ సమాజాన్ని పట్టి పీడించే పెద్ద వైరస్ కేసిఆర్ అని వైఎస్ షర్మిల విమర్శించారు. సీఎం పాలన తీరుపై ట్వీట్ ద్వారా విమర్శనా అస్త్రాలు సందించారు. రాష్ట్ర ఖజానా ఖాళీ చెయ్యడానికే పుట్టిన మహమ్మారి కేసిఆర్ అన్నారు. ప్రజలను అప్పుల పాలు చెయ్యడానికి పట్టుకున్న వైరస్ కేసిఆర్ అని ఎద్దేవా చేశారు. కరోనాతో పోరాడి బ్రతక వచ్చు కానీ BRS వైరస్ కంట పడితే ఖేల్ ఖతం అని అన్నారు. నిమ్స్ శంకుస్థాపన ఇంకెప్పుడని ట్వీట్ ద్వారా ప్రశ్నించారు.
15 వందల కోట్లతో ఉస్మానియా దవాఖానా కడతామని చెప్పిన ట్విన్ టవర్స్ ఎక్కడ అన్నారు. కొత్త సచివాలయం మీద పెట్టిన శ్రద్ధ ప్రజల ఆరోగ్యం మీద లేదని ఆరోపించారు. కాళేశ్వరం కమీషన్ల మీద పెట్టిన దృష్టి వైద్యాభివృద్ధి మీద లేదన్నారు. శంకుస్థాపనలు తప్ప 10 ఏళ్లలో సాధించేమి లేదన్న షర్మిల ఇదేనా మీరు సాధించిన ఆరోగ్య తెలంగాణ అని ప్రశ్నించారు.బీఆర్ ఎస్ పాలన అంతానికి ఇంజక్షన్ రెడీ అయ్యింది దొర గారు అంటూ షర్మిల ట్వీట్ చేశారు.