తుఫాన్ ప్రభావంతో ఉధృతంగా మంజీర నది.. ఏడుపాయల ఆలయ గర్భగుడి మూసివేత
తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు మంజీర నది ప్రవహిస్తోంది. దీంతో మెదక్ ఏడుపాయల వనదుర్గ మాత ఆలయ గర్భగుడిని మూసివేశారు.
తుఫాన్ ప్రభావంతో ఉధృతంగా మంజీర నది.. ఏడుపాయల ఆలయ గర్భగుడి మూసివేత
తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు మంజీర నది ప్రవహిస్తోంది. దీంతో మెదక్ ఏడుపాయల వనదుర్గ మాత ఆలయ గర్భగుడిని మూసివేశారు. గణపురం ఆనకట్ట పొంగి పొర్లడంతో అమ్మవారి ఆలయం ముందు నుంచి వాగు ఉధృతంగా ప్రవహించడంతో గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ముందస్తు జాగ్రత్తగా మూసివేశారు. భక్తుల దర్శనార్థం రాజగోపురం దగ్గర ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు.