సూర్యగ్రహణం: యాదాద్రి ఆలయం మూసివేత

దేశ వ్యాప్తంగా పాక్షిక సూర్యగ్రహణం గురువారం ఉదయం 8.26గంటల నుంచి 10.57గంటల వరకు ఏర్పడనుంది.

Update: 2019-12-25 06:13 GMT
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం

దేశ వ్యాప్తంగా పాక్షిక సూర్యగ్రహణం గురువారం ఉదయం 8.26గంటల నుంచి 10.57గంటల వరకు ఏర్పడనుంది. ఈ కారణంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని బుధవారం రాత్రి నుంచి మూసివేస్తున్నట్లు ఈఓ గీతారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాతగుట్ట ఆలయాన్ని సైతం మూసివేస్తామని ఆమె పేర్కొన్నారు. బుధవారం సాయంకాలం భక్తుల మొక్కుసేవలు, దర్బార్‌సేవ, అర్చనలు యధావిధిగా ఉంటాయని ఆమె అన్నారు.

ఈ పాక్షిక సూర్యగ్రహణం గురువారం ఉదయం 8.26గంటలకు మొదలయి 10.57గంటల వరకు ఉంటుదని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని బుధవారం (నేడు) రాత్రి ఆలయ ద్వార బంధనం చేస్తారని తెలిపారు. గ్రహణం విడిచిన తరువాత అంతే 26వ తేది గురువారం రోజున మధ్యాహ్నం 12గంటల తరువాత ఆలయాన్ని తెరుస్తారని తెలిపారు. ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, పుణ్యాహవాచనం, మహానివేదన చేస్తారన్నారు.

అనంతరం గురువారం మధ్యాహ్నం 2గంటల నుంచి భక్తులకు సర్వదర్శనాన్ని కల్పిస్తామని తెలిపారు. అంతే కాకుండా శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపాన్ని కూడా శుద్ధి చేసి మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు సత్యదేవుని వ్రతాలు జరిపిస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ఆలయంతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలను గ్రహనం సందర్భంగా బుధవారం రాత్రి నుంచి మూసివేయనున్నారు. 



Tags:    

Similar News