తొలి కాన్పు.. సాధారణ ప్రసవం.. ముచ్చటగా ముగ్గురు పిల్లలు!

Update: 2020-06-14 13:29 GMT

ప్రస్తుత కాలంలో కాన్పుకోసం ఆస్పత్రికి వెలితే చాలు సిజేరియన్ చేసి చిన్నారుల్ని బయటికి తీస్తున్నారు. ఎక్కడ చూసినా ఇదే తీరు, అసలు సహజ ప్రసవాల ఊసే లేదు. ఎంత కష్టమయినప్పటికీ ప్రభుత్వాసుపత్రుల్లో మాత్రం సహజ ప్రసవాలు చేసేందుకే చేసేందుకే ప్రాధాన్యం ఇస్తారు. ఒక వేల గర్భిణులు క్లిష్టమైన పరిస్ధితుల్లో ఉన్నప్పుడు మాత్రమే శస్త్రచికిత్స చేసి శిశువును బయటకు తీస్తుంటారు. ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ జిల్లాలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తొలికాన్పులోనే ఓ నిండు గర్భిణి సహజప్రసవంలో ముగ్గురు శిశువులు జన్మించారు. ప్రస్తుతం ఈ టాపిక్ ప్రాధాన్యం సంతరించుకుంది.

పూర్తివివరాల్లోకెళితే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానాలో నారాయణపేట పట్టణం పళ్ళ ప్రాంతానికి చెందిన ఓ మహిళ ప్రసవ నొప్పులతో ఆస్పత్రిలో చేరింది. కాగా వైద్యులు ఆమెను పరీక్షించారు. ఆ తరువాత మహిళకు అక్కడి వైద్యులు సిజేరియన్ కాకుండా నార్మల్ డెలివరీతో పురుడు పోశారు. ప్రసవం అనంతరం ముగ్గురు పిల్లలు, తల్లి ఆరోగ్యంగా ఉన్నట్లుగా ప్రభుత్వాసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ ముగ్గురు శిశువుల్లో ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల ఉండడం విశేషం. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందిస్తున్న చక్కని వైద్య సేవలకు ఈ ప్రసవం ఒక ఉదాహరణగా పలువురు చెప్పుకుంటున్నారు. 

Tags:    

Similar News