Harish Rao: వై నాట్ వన్ నేషన్.. వన్ ఎంఎస్‌పీ.. గుజరాత్‌కు ఒక నీతి, తెలంగాణకు ఒక నీతా?
Harish Rao: పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు.
మాజీ మంత్రి హరీష్‌రావు బంధువులపై చీటింగ్ కేసు
Harish Rao: పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం One Nation, One MSP అని ఎందుకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. నాణ్యమైన పత్తిని పండిస్తున్న తెలంగాణ రైతు పట్ల ఎందుకు వివక్ష చూపుతోందన్నారు.
గుజరాత్ పత్తికి మద్దతు ధరగా క్వింటాల్‌కు 8 వేల 257 రూపాయలు చెల్లిస్తున్న కేంద్రం, తెలంగాణ పండిస్తున్న పత్తికి 7వేల 521 రూపాయలు మాత్రమే చెల్లించడం దుర్మార్గం అని అన్నారు.