Ponnam Prabhakar: విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తాం
Ponnam Prabhakar: సలహాలు సూచనలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం
Ponnam Prabhakar: విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తాం
Ponnam Prabhakar: విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం తీసుకుందని చెప్పారు. అభివృద్ధి కోసం సలహాలు సూచనలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూల్స్‌కు మించి పోటీ పడాలని ఆకాంక్షించారు. హైదరాబాద్ అమీర్‌పేట డీకే రోడ్డులోని గర్ల్స్ ప్రైమరీ స్కూల్, హైస్కూల్‌లో అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురషెట్టి ,ఇతర అధికారులు పాల్గొన్నారు.