CM KCR: పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా డబుల్ బెడ్రూం ఇండ్లు

CM KCR: దశలవారీగా డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఉచితంగా ఇస్తున్నాం

Update: 2023-09-17 06:32 GMT

CM KCR: పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా డబుల్ బెడ్రూం ఇండ్లు

CM KCR: గత ప్రభుత్వాలు ఇచ్చిన అగ్గిపెట్టెల లాంటి ఇండ్ల స్థానంలో అర్హులైన నిరుపేదలందరికీ దశలవారీగా డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఉచితంగా అందించాలన్నది బిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని సీఎం కేసీఆర్ తెలిపారు. పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా ఈ గృహాల నిర్మాణం కొనసాగిస్తున్నామని చెప్పారు. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ అని.. హైదరాబాద్ మహానగరంలో నిర్మాణం పూర్తిచేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న దాదాపు లక్ష గృహాలను పేదలకు పంపిణీ చేస్తున్నామన్నారు. పారదర్శకంగా, లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపికచేసి, మహిళల పేరిట గృహాలను అందిస్తున్నట్లు వివరించారు. ఎవరైనా అర్హులకు ఇప్పుడు ఇల్లు రాకపోయినా ఆందోళన చెందాల్సిన పనిలేదని... ఈ పథకం ఇంతటితో ఆగిపోయేది కాదని సీఎం కేసీఆర్ అన్నారు.

Tags:    

Similar News