హైదరాబాద్‎లోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్..!

సోమవారం నగరంలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరాను నిలిపివేయనున్నట్లు జలమండలి ఎండీ ఎం.దానకిశోర్ తెలిపారు. మహానగరానికి కృష్ణానది నుంచి మంచినీటిని తరలిస్తున్న కృష్ణా ఫేజ్ -3 పైపులైన్‌కు పలుచోట్ల ఏర్పడ్డ లీకేజీల మరమ్మతుల దృష్ట్యా, పైపులైను లీకేజీలను అరికట్టేందుకు అత్యవసరంగా మరమ్మతులు చేపడుతున్నామన్నారు.

Update: 2019-09-22 05:06 GMT

సోమవారం నగరంలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరాను నిలిపివేయనున్నట్లు జలమండలి ఎండీ ఎం.దానకిశోర్ తెలిపారు. మహానగరానికి కృష్ణానది నుంచి మంచినీటిని తరలిస్తున్న కృష్ణా ఫేజ్ -3 పైపులైన్‌కు పలుచోట్ల ఏర్పడ్డ లీకేజీల మరమ్మతుల దృష్ట్యా, పైపులైను లీకేజీలను అరికట్టేందుకు అత్యవసరంగా మరమ్మతులు చేపడుతున్నామన్నారు. దీని ప్రభావంతో సాహెబ్‌నగర్, ఆటోనగర్, వైశాలినగర్, మీర్‌పేట, జల్‌పల్లి, మైలార్‌దేవ్‌పల్లి, శాస్త్రీపురం, బండ్లగూడ, బుద్వేల్, సాలార్‌జంగ్‌నగర్, హైదర్‌గూడ, గోల్డెన్‌హైట్స్, గంధంగూడ, ఆళ్లబండ, భోజగుట్ట, షేక్‌పేట, ప్రశాసన్‌నగర్, మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, నార్సింగి, బోడుప్పల్, చెంగిచెర్ల, ఫిర్జాదిగూడ, సైనిక్‌పురి, మౌలాలి, లాలాపేట, స్నేహపురికాలనీ, కైలాసగిరి రిజర్వాయర్ ప్రాంతాల్లో 23న ఉదయం 6 గంటల నుంచి 24న ఉదయం 6 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. ఈ ప్రాంతాల్లోని ప్రజలు నీటిని పొదుపుగా వాడుకొని, సహకరించాలని ఎండీ కోరారు.  

Tags:    

Similar News