Ramesh Babu: బీఆర్ఎస్ పార్టీలో దొంగలున్నారు

Ramesh Babu: వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు హాట్‌ కామెంట్స్

Update: 2023-07-13 13:54 GMT

Ramesh Babu: బీఆర్ఎస్ పార్టీలో దొంగలున్నారు

Ramesh Babu: వేములవాడ ఎమ్మెల్యే రమేష్‌ బాబు హాట్‌ కామెంట్స్ చేశారు. 24 గంటల కరెంట్ విషయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వాఖ్యల పట్ల బీర్ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో వేములవాడలో నిర్వహించిన ధర్నాలో రమేష్ బాబు పాల్గొన్నారు. అయితే.. ధర్నాలో మాట్లాడిన రమేష్ బాబు.. తన మాటల్లో ఒకింత నిర్వేదం.. ఒకింత ఆక్రోశం వ్యక్తం చేసినట్టు కనిపించింది. బీఆర్ఎస్ పార్టీలో కొంత మంది అటు ఇటు ఉంటున్నారని.. తనకు అన్నీ తెలుసంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

తాను ఎమ్మెల్యేగా ఉన్నా, లేకున్నా ఏం పర్వాలేదని.. ఇప్పటికే నాలుగు సార్లు గెలిచాను, అది చాలన్నారు. మళ్లీ పదవిపై వ్యామోహం లేదని.. ఎప్పుడో తాను ప్రజల్లో గెలిచినట్టేనని చెప్పుకొచ్చారు. కానీ..ప్రజల ఆస్తులు కబ్జా చేస్తే మాత్రం ఊరుకోను..కబర్ధార్ అంటూ పరోక్ష విమర్శలు చేశారు రమేష్ బాబు.

Tags:    

Similar News