Vellala Ram Mohan: ఈ నెల 16న బీజేపీలో చేరనున్న వెల్లాల రామ్మోహన్

Vellala Ram Mohan: సనత్‌నగర్‌ నియోజకవర్గంలో రామ్మోహన్‌కు సామాజిక సేవకుడిగా గుర్తింపు

Update: 2024-02-13 08:30 GMT

Vellala Ram Mohan: ఈ నెల 16న బీజేపీలో చేరనున్న వెల్లాల రామ్మోహన్

Vellala Ram Mohan: హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ నియోజకవర్గంలో సామాజిక సేవతో గుర్తింపు పొందిన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్ ఈ నెల 16న బీజేపీలో చేరనున్నారు. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. గత 20 ఏళ్లుగా పేద బడుగు వర్గాల కుటుంబాలకు సహాయం చేస్తూ తన ఔన్నత్యాన్ని చాటుకుంటున్నారు రాం మోహన్.

పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఫీజుల సహాయం చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడిగానూ రాంమోహన్‌కు పేరుంది. వైసీపీ రాష్ట్ర యూత్ అధ్యక్షులుగా పని చేశారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల ప్రభావం కారణంగా పార్టీకి దూరంగా ఉన్నారని ఆయన అనుచరులు తెలిపారు. పేద బ్రాహ్మణుల కోసం బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్యను స్థాపించి సేవ చేస్తున్నారు.

Tags:    

Similar News