Adilabad: ఆదిలాబాద్‌‌లో ఓ వ్యక్తి దారుణ హత్య.. బండరాళ్లతో కొట్టి...

Adilabad: పోలీస్ ఓల్డ్ క్వార్టర్స్‌లోని చెత్త కుప్పల మధ్య మృతదేహం...

Update: 2021-12-25 05:46 GMT

Adilabad: ఆదిలాబాద్‌‌లో ఓ వ్యక్తి దారుణ హత్య.. బండరాళ్లతో కొట్టి...

Adilabad: ఆదిలాబాద్‌లో దారుణ హత్య జరిగింది. జిల్లా కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వెనకాలే హత్య జరగడం కలకలం రేపుతోంది. పోలీస్ ఓల్డ్ క్వార్టర్స్‌లో ఓ వ్యక్తి చనిపోయి ఉండడాన్ని తెల్లవారుజామున స్థానికులు గుర్తించారు. చెత్త కుప్పల మధ్య మృతదేహం పడి ఉంది. శుక్రవారం రాత్రి ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. హత్యకు గురైన వ్యక్తి మొహం రక్తపు మడుగులో ఉండడంతో బండరాళ్లతో మోదీ హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు.

Tags:    

Similar News